Viral Video: పోలింగ్‌ కేంద్రం వద్ద అధికారి చెంపచెళ్లుమనిపించిన అభ్యర్థి

ఆయనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

రాజస్థాన్‌లో ఓ పోలింగ్‌ బూత్‌ వద్ద ఓ అధికారి చెంపచెళ్లుమనిపించాడు ఓ అభ్యర్థి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. డియోలి ఉనియారా నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా నరేశ్ మీనా అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు.

సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం)ను ఆయన చెంపదెబ్బ కొట్టారు. సంరవత పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నరేశ్ మీనా పోలింగ్ బూత్‌లోకి వెళ్లడమే కాకుండా ఎన్నికల ప్రొటోకాల్‌ను పర్యవేక్షించడానికి డ్యూటీ చేస్తున్న ఎస్‌డీఎం అమిత్ చౌదరిని చెంపదెబ్బ కొట్టడంపై విమర్శలు వస్తున్నాయి.

ఆయనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నరేశ్ మీనా గతంలో కాంగ్రెస్ లో పనిచేశారు. డియోలీ ఉనియారా ఉపఎన్నికకు నరేశ్‌ మీనాను కాదని కాస్టోర్ చంద్ మీనాను కాంగ్రెస్‌ పార్టీ నామినేట్ చేయడంతో నరేశ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో నరేశ్‌ను ఇటీవల కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.

డీకే అరుణ లగచర్ల పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. సీఎం రేవంత్‌పై విమర్శలు