Mysterious Animal
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అలాగే, కేంద్ర మంత్రులుగా కూడా నేతలు ప్రమాణం చేశారు. వీవీఐపీలు సహా 8,000 మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అయితే, అక్కడ కెమెరాకు చిక్కిన ఓ జంతువు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత బీజేపీ ఎంపీ దుర్గా దాస్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అభివాదం చేస్తున్న సమయంలో అక్కడి బ్యాక్‌గ్రౌండ్‌లో చిరుత/పిల్లి లాంటి జంతువు నడుచుకుంటూ వెళ్లింది.
ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు అది ఏంటన్న విషయంపై తెగ ఆసక్తి కనబర్చుతున్నారు. అది చిరుతపులా? పిల్లా? కుక్కా? అన్న విషయం ఎవరికీ తెలియడం లేదు. అది అచ్చం చిరుతలా నడుచుకుంటూ వెళ్లింది. దీంతో అక్కడ చిరుతలు ఎందుకు ఉంటాయని, ఎవరో ఎడిట్ చేసి ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారని కొందరు కామెంట్లు చేశారు. అది పెంపుడు జంతువే అయి ఉంటుందని కొందరు అంటున్నారు.
An animal was seen strolling back in the Rashtrapati Bhavan after MP Durga Das finished the paperwork
~ Some say it was a LEOPARD while others call it some pet animal. Have a look ? pic.twitter.com/owu3ZXacU3
— The Analyzer (News Updates?️) (@Indian_Analyzer) June 10, 2024
Also Read: నూకాంబికా అమ్మవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్న పవన్ కల్యాణ్