Viral Video : ఆధ్యాత్మిక కార్యక్రమంలో దారుణం.. మహిళ అని కూడా చూడకుండా పైకి ఎత్తి ఎలా విసిరేశాడో చూడండి

Viral Video : మహిళ అని కూడా చూడకుండా ఆ వ్యక్తి చాలా దారుణంగా వ్యవహరించాడని, ఓ మహిళ పట్ల అనుసరించే విధానం ఇదేనా? అని మండిపడుతున్నారు.

Baba Bageshwar Dham (Photo : Google)

Woman Thrown Away : అదో ఆధ్యాత్మిక కార్యక్రమం. బాబాని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అక్కడ అంతా భజనలు జరుగుతున్నాయి. భక్తులంతా చేతులు జోడించి ప్రార్థనలు చేస్తున్నారు. ఇంతలో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. బాబా శిష్యుడు రెచ్చిపోయాడు. ఓ మహిళా భక్తురాలిని పైకి ఎత్తి కిందకి పడేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే..
ఉత్తర భారత దేశంలో బాగేశ్వర్ ధామ్ అధిపతి పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి అలియాస్ బాబా బాగేశ్వర్ ధామ్ సర్కార్ కి భక్తుల విశేష ఆదరణ ఉంది. ఆయన ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో దివ్య దర్బార్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. దీనికి పెద్ద సంఖ్యలు భక్తులు తరలివచ్చారు. అంతా అక్కడి చేరి బాబా భజనలు వింటున్నారు. తన్మయత్వంలో ఊగిపోతున్నారు.

Also Read..Tomatoes Price : పచ్చని కాపురంలో ‘టమాటా’ చిచ్చు .. ఇల్లు వదిలివెళ్లిపోయిన భార్య

బాబా దగ్గరికి ఎవరూ రాకుండా ఆయన చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. బాబా చుట్టూ ఆయన అనుచరులు, శిష్యులు, బౌన్సర్లు ఉన్నారు. ఇక పోలీసులు కూడా అక్కడే డ్యూటీలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఓ మహిళ బ్యారికేడ్ దాటుకుని ముందుకు వచ్చేసింది. బాబా దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన ఒక వాలంటీర్ వెంటనే అలర్ట్ అయ్యాడు. ఆ మహిళను అడ్డుకున్నాడు. ఆమె తన చేతులతో పైకి ఎత్తి బ్యారికేడ్ అవతల పడేశాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళ పట్ల బాబా అనుచరుడు ప్రవర్తించిన తీరుపై అంతా మండిపడుతున్నారు. ఇది అమానుషం అంటున్నారు. మహిళ అని కూడా చూడకుండా ఆ వ్యక్తి చాలా దారుణంగా వ్యవహరించాడని, ఓ మహిళ పట్ల అనుసరించే విధానం ఇదేనా? అని మండిపడుతున్నారు.

Also Read..Alternative To Tomatoes : టమాటాలకు బదులు ఇవి వాడుకోండి .. వంటకాలకు రుచికి రుచీ..డబ్బు కూడా ఆదా..

పైగా అక్కడే చాలా మంది పోలీసులు ఉన్నారు. కళ్ల ముందే ఘోరం జరుగుతున్నా వారు మౌనంగా ఉన్నారు తప్ప అడ్డుకోకపోవడం దారుణం అంటున్నారు. మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మహిళా భక్తులకు మీర్చిచే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇది అత్యంత అమానవీయమైన ఘటన అని వాపోయారు. ఇలాంటి విపరీత చర్యలతో సభ్యసమాజానికి ఏం మేసేజ్ ఇద్దామని అనుకున్నారు? అని నిలదీస్తున్నారు. అలాగే, అక్కడే ఉన్నా చోద్యం చూస్తూ నిల్చున్న పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.