Tomatoes Price : పచ్చని కాపురంలో ‘టమాటా’ చిచ్చు .. ఇల్లు వదిలివెళ్లిపోయిన భార్య

వార్నీ టమాటాలు ఎంత పనిచేశాయి. భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టాయి. టమాటాల ధరలో భారీగా పెరగటంతో దొంగతనాలకే కాదు కాపురంలో చిచ్చులు పెట్టేలా మారిపోయాయిరా దేవుడా అనుకులా ఉందీ ఘటన.

Tomatoes Price : పచ్చని కాపురంలో ‘టమాటా’ చిచ్చు .. ఇల్లు వదిలివెళ్లిపోయిన భార్య

family Differences due to tomatoes

family Differences due to tomatoes : భార్యా, భర్తా, ఇద్దరు పిల్లలు. చక్కటి ముచ్చటైన సంసారం. మధ్య తరగతి కుటుంబమే అయినా చింతలేని కుటుంబం. ముచ్చటైన ఇద్దరు పిల్లలతో అన్యోన్యంగా సాగిపోయే ఆ కుటుంబంలో ‘టమాటా’ చిచ్చు పెట్టింది. పచ్చని సంసారంలో ఎర్రని ‘టమాటా’ మంటపెట్టింది. భార్య ఇల్లు వదిలిపోయేలా చేసింది. ఇంతకీ పాపం మధ్యలో ఆ టమాటా ఏం చేసింది. ఈ గొడవేంటీ.. ఈ టమాటా గోలేంటీ అంటే..

ప్రస్తుతం భారతదేశంలో ‘టమాటా’ లు సామాన్యుడు కొనలేని పరిస్థితి ఉంది. కిలో దాదాపు రెండు వందల రూపాలు అమ్ముతున్న కొనాలంటే మధ్యతరగతి కుటుంబానికి కూడా సాధ్యంకావటం లేదు. దీంతో టమాటా కూర అనేది రిసెస్ట్ కూర అయి కూర్చుంది. ఈ క్రమంలో టమాటా ధరలు భారీ స్థాయిలో కొనసాగుతున్న వేళ మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో ఓ పచ్చని కాపురంలో టమాటా చిచ్చు పెట్టింది.

Andhra Pradesh : ఏపీలో టమాటా రైతు హత్య .. ఈ దారుణానికి కారణం అదేనా..?!

సంజీవ్ బర్మన్ అనే వ్యక్తి స్థానికంగా ఓ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. భర్తకు చేదోడు వాదోడుగా భార్య కూడా కష్టపడి పనిచేస్తోంది. ఆ టిఫిన్ సెంటర్ మీద వచ్చే ఆదాయంతోనే వారి ఇద్దరు పిల్లలతో కలిసి హాయిగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో వంట చేసే సమయంలో భర్త భార్యకు తెలియకుండా కూరలో రెండంటే రెండు టమాటాలు వేశాడు. అది తెలిసిన ఆమె అంతెత్తున ఎగిరిపడింది. టమాటాలు ఇంత ధర ఉన్నాయి..టమాటాలు వినియోగించేలా ఉందా మన కుటుంబ పరిస్థితి..ఎందుకలా చేశావు..టమాటాలు లేకపోతే కూర వండుకోలేమా? అంటూ మండిపడింది. దానికి సంజీవ్ కూడా ఏముందిలే రెండేగా వేసింది దానికి ఇంత రాద్దాంతం చేస్తావేంటీ అంటూ మండిపడ్డాడు. దీంతో ఆమె మొహం కోపంతో ‘టమాటా’లా ఎర్రబడిపోయింది.

అలా భార్యాభర్తల ఇద్దరు మాటా మాటా అనుకున్నాదు. అదికాస్తా బాగా పెద్దది అయ్యింది. టమాటా గురించి ఇంట్లో రచ్చ రచ్చ అయిపోయింది. మూడు రోజుల పాటు భర్తతో మాట్లాడటం మానేసింది. ఈక్రమంలో ఆమె పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. భార్య కోసం చుట్టుపక్కల వెతికినా ఉపయోగం లేకపోవడంతో సంజీవ్ చివరకు పోలీసులను ఆశ్రయించాడు.

Tomato Price : బౌన్సర్లను పెట్టుకుని టమాటాలు అమ్ముతున్న వ్యాపారి ..

టమాటా వల్లే తన భార్యకు తనకు మధ్య గొడవ జరిగిందని పోలీసులకు చెప్పాడు. అది విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆమె కోసం వెతుకుతామని భరోసా ఇచ్చారు. అలాగే సంజీవ్ కూడా భార్య ఆచూకీ కోసం తెలిసినవారినల్లా అడుగుతున్నాడు. అలా పచ్చని కాపురంలో టమాటా చిచ్చుతో భార్యా పిల్లలకు ఇల్లు వదిలిపోయేలా చేసింది.