Virat Kohli
Virat Kohli : అయోధ్య నగరంలోని రామ మందరి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు దేశవ్యాప్తంగా 8వేల మంది ప్రముఖులను తాజాగా ఆహ్వానించారు. ప్రముఖ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ సినీనటులు,అమితాబ్ బచ్చన్ , అక్షయ్ కుమార్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, రతన్ టాటాలకు శ్రీ రామజన్మభూమి తీర్థ కేత్ర నిర్వాహకులు ఆహ్వానాలు పంపించారు. 2024వ సంవత్సరం జనవరిలో అయోధ్యలో రామమందిరం సిద్ధమవుతుందని భావిస్తున్నారు.
ALSO READ : Ayodhya : అయోధ్య రామజన్మభూమిలో భారీ సాయుధ భద్రత…ఎందుకంటే…
జనవరి 22వతేదీన ఆలయంలో రామ్ లల్లా విగ్రహానికి ప్రతిష్ఠాపన తేదీగా నిర్ధారించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు హాజరుకానున్నారు.ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 22వతేదీన నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామమందిర ప్రతిష్ఠాపన వేడుకలను పండుగలా జరుపుకుంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ చెప్పారు.
ALSO READ : Good news : వినియోగదారులకు శుభవార్త…కొత్త పంట రాకతో తగ్గిన కూరగాయల ధరలు
ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కొంతమంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. పూజారులు, సాధువులను ఈ వేడుకకు ఆహ్వానించారు. సాధువులతో పాటు 2,000 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను రామ మందరి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు ఆహ్వానించినట్లు శ్రీ రామజన్మభూమి తీర్థ కేత్ర నిర్వాహకులు చెప్పారు.