Volkswagen : వోక్స్‌వాగన్ సంచలన నిర్ణయం..30వేల మంది ఉద్యోగులు తొలగింపు!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వాగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులేస్తోంది.

Wv
Volkswagen ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వాగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులేస్తోంది. 30,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని వోక్స్‌వాగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఖర్చులు తగ్గించుకోవడం,టెస్లా వంటి ఎలక్టిక్ వెహికల్ సంస్థకు గట్టి పోటీ ఇవ్వడం కోసం ఉద్యోగాల్లో కోత ఆలోచన చేస్తుందని,ఈమేరకు సూపర్‌వైజరీ బోర్డుకు వోక్స్‌వాగన్ సీఈఓ హెర్బర్ట్ డైసెస్ ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చినట్టు బుధవారం జర్మన్ డెయిలీ హండెల్స్ బ్లాట్ ఒక కథనంలో తెలిపింది.
అయితే ఈ వార్తలపై వోక్స్‌వాగన్ ప్రతినిధి మైకేల్ మాన్కే మాట్లాడుతూ..మార్కెట్లో కొత్తగా వస్తున్న వారికి గట్టి పోటీ ఇచ్చే విషయంలో ఎలాంటి రాజీ లేదని, ఇందుకు సంబంధించి చాలా ఆలోచనలు ఉన్నప్పటికీ దానికి తుదిరూపు ఇవ్వాల్సి ఉందని చెప్పారు.