Girl Beat Up Shopkeeper : తన తండ్రిని కొట్టాడని కూతురు విశ్వరూపం.. కర్రతో చితకబాదేసింది

తన తండ్రిని కొట్టాడని ఓ కూతురు ఆగ్రహంతో ఊగిపోయింది. అపరకాళి అవతారం ఎత్తింది. తన తండ్రిని కొట్టడాన్ని తట్టుకోలేకపోయిన ఆమె చేతిలో కర్ర తీసుకుని ఆవేశంగా వెళ్లింది. తన తండ్రి పై చేయి..

Girl Beat Up Shopkeeper : తన తండ్రిని కొట్టాడని కూతురు విశ్వరూపం.. కర్రతో చితకబాదేసింది

Girl Beat Up Shopkeeper

Updated On : December 9, 2021 / 9:59 PM IST

Girl Beat Up Shopkeeper : తన తండ్రిని కొట్టాడని ఓ కూతురు ఆగ్రహంతో ఊగిపోయింది. అపరకాళి అవతారం ఎత్తింది. తన తండ్రిని కొట్టడాన్ని తట్టుకోలేకపోయిన ఆమె చేతిలో కర్ర తీసుకుని ఆవేశంగా వెళ్లింది. తన తండ్రి పై చేయి చేసుకున్న వ్యక్తిని కర్రతో చికతబాది అతడికి బుద్ధి చెప్పింది. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శివపురిలోని దినారా పట్టణంలో ఓ టీ దుకాణదారుడు తన వృద్ధపై దాడి చేయడంతో కూతురు ఆ దుకాణదారుడిని కర్రతో కొట్టింది. బాధితుడు తేజ్ సింగ్ పరిహార్ దీనిపై స్పందించాడు. తాను హైవే సమీపంలోని భురా టీ షాప్ లో టీ తాగానని, ఆ తర్వాత రూ.5 చెల్లించినా.. డబ్బులు ఇవ్వలేదని టీ కొట్టు యజమాని తనను కొట్టాడని వాపోయాడు.

SBI CBO Recruitment 2021 : ఎస్బీఐలో ఉద్యోగాలు.. 1226 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఆ తర్వాత అతడు ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లాక విషయం తెలుసుకున్న కూతురు కోపంతో ఊగిపోయింది. నా తండ్రినే కొడతావా? అంటూ.. కర్ర తీసుకుని టీ కొట్టుకి వెళ్లి అక్కడ టీ కొట్టు యజమానిని కొట్టిందని సింగ్ తెలిపారు. ఈ గొడవను చూసిన చుట్టుపక్కల వాళ్లు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ అమ్మాయి చేతిలో కర్రతో వచ్చి టీ కొట్టు యజమానిని చితకబాదడం విస్మయానికి గురి చేసింది. ఆ తర్వాత కారణం తెలుసుకున్నారు. ఆమెకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపేశారు. తండ్రి బాధను చూడలేక ఆ కూతురు చేసిన పనికి ప్రశంసలు అందుతున్నాయి. శభాష్, మంచి పని చేశావ్ అని కొందరు నెటిజన్లు ఆమెను సమర్థించారు.