కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను ఎండగట్టే..మమత బెనర్జీ..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. కేవలం మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందని సమాచారం. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోడీ..2020, జనవరి 11వ తేదీ శనివారం వెస్ట్ బెంగాల్‌కు చేరుకున్నారు. ఎస్ఎస్‌సీ బోస్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి చేరుకున్న మోడీకి ఘన స్వాగతం లభించింది.
అనంతరం అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్‌కు చేరుకున్నారు మోడీ. అక్కడ సీఎం మమత బెనర్జీ సమావేశమయ్యారు. మీటింగ్ అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA, NRC, NPR పట్ల తాము అసంతృప్తిగా ఉన్నట్లు, వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. సీఏఏపై పునరాలోచించాలని కోరినట్లు తెలిపారు.
అయితే..కొన్ని కార్యక్రమాల వల్ల ఇక్కడకు రావడం జరిగిందని, ఢిల్లీలో ఈ విషయాలు తర్వలో చర్చిద్దామని మోడీ చెప్పినట్లు తెలిపారు. ఇతర విషయాలు చర్చించేందుకు మోడీని కలవడం జరిగిందన్నారు.
ఇక అంతకంటే ముందు..కోల్ కతాకు వచ్చిన మోదీకి విమానాశ్రయం వద్ద పౌరసత్వ సెగ తగిలింది. విద్యార్థి సంఘాలు ఎయిర్ పోర్టు బయట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ మోదీ..ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సీఏఏను వ్యతిరేకిస్తూ..నిరసనలు చేశారు. బ్యానర్లు, నల్ల జెండాలు కట్టారు.
సీఏఏను సీఎం మమత బెనర్జీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు మమత. బెంగాల్‌లో సీఏఏను అమలు చేయబోమని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.
Read More : కరీంనగర్‌లో ఏం జరుగుతోంది : బీజేపీలోకి రవీందర్ సింగ్ ?