ఊడిపోయిన ముక్కుపుడక స్క్రూ.. శ్వాసతో పాటు ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన వైనం.. బయటకు ఎలా తీశారో తెలుసా?

West Bengal: వాయు నాళాలకు ప్రమాదం తలెత్తకుండా వైద్యులు స్క్రూను తీసుకొచ్చిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చుతోంది.

ఊడిపోయిన ముక్కుపుడక స్క్రూ.. శ్వాసతో పాటు ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన వైనం.. బయటకు ఎలా తీశారో తెలుసా?

పశ్చిమ బెంగాల్‌కు చెందిన 35 ఏళ్ల వర్ష అనే మహిళ ముక్కుపుడక స్క్రూ ఊడిపోయింది. ఆమె శ్వాస పీల్చుకునే సమయంలో ముక్కులో నుంచి ఆ చిన్న స్క్రూ ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. మొదట ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు.

కొన్ని రోజుల తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడింది. దీంతో ఆసుపత్రికి వెళ్తే ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. ఆమెకు నాన్-ఇన్వాసివ్ సర్జరీ చేయాలని చెప్పారు. మొదట ఆమె బయటపడినా చివరకు సర్జరీకి ఒప్పుకుంది. ఆమెకు సర్జరీ పట్ల అవగాహన కల్పించిన వైద్యులు బ్రాంకోస్కోప్‌ను లోపలకు పంపారు.

వర్ష ఊపిరితిత్తుల్లోని కొంత భాగం తొలగించే ఇన్వాసివ్ సర్జరీ కూడా చేయాలనుకున్నారు. భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా దాన్ని వద్దనుకున్నారు. చివరకు బ్రాంకోస్కోప్‌తోనే పలుసార్లు ప్రయత్నించి ముక్కుపుడకను బయటకు తీయడంలో సక్సెస్ అయ్యారు.

ఈ విధానంలో స్క్రూలాంటి వస్తువును బయటకు తీయడం అంత సులువేం కాదు. వర్ష ఊపిరితిత్తుల్లో దాదాపు 15 రోజులు స్క్రూ ఉండిపోయింది. అంతేగాక, ఆ స్క్రూ చుట్టూ కణజాలం కూడా పెరుగుతోంది. ఈ విషయాలను గుర్తించిన డాక్టర్లు చాలా జాగ్రత్తగా, వాయు నాళాల నుంచి స్క్రూను బయటకు తీసుకువచ్చారు. వాయు నాళాలకు ప్రమాదం తలెత్తకుండా వైద్యులు స్క్రూను తీసుకొచ్చిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చుతోంది.

Also Read: వామ్మో.. గాల్లో విమానం పక్కనే ఏంటిది? వీడియో వైరల్