TMC Leader Slapping : వెస్ట్ బెంగాల్ మంత్రి రథిన్ ఘోష్, ఆయన అనుచరుల తీరు వివాదానికి దారితీసింది. మంత్రి అనుచరుడు రెచ్చిపోయాడు. గూండాలా వ్యవహరించాడు. సమస్యలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిపై దాడి చేశాడు. అతడి చెంప పగలకొట్టాడు.
ఉత్తర 24 పరగణాస్ లోని సరిపోనా గ్రామానికి మంత్రి రథిన్ ఘోష్ వెళ్లారు. అక్కడ స్థానికులతో ఆయన మాట్లాడుతున్నారు. ఇంతలో సాగర్ బిశ్వాస్ అనే స్థానికుడు అక్కడికి వచ్చాడు. స్థానికంగా ఉన్న సమస్యల గురించి మంత్రికి చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే, మంత్రి రథిన్ ఘోష్ ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇంతలో అక్కడే ఉన్న మంత్రి అనుచరుడు రెచ్చిపోయాడు. సాగర్ బిశ్వాస్ పై దాడి చేశాడు. అతడి చెంప పగలగొట్టాడు. దీంతో అక్కడ సారిగా కలకలం రేగింది. మంత్రి అనుచరుడు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. ఇంతలో స్పందించిన ఇతర వ్యక్తులు.. అక్కడికి వచ్చిన మంత్రి అనుచరుడిని అడ్డుకున్నారు. సాగర్ బిశ్వాస్ ను దూరంగా తీసుకెళ్లారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
సమస్యలు గురించి చెప్పేందుకు వచ్చిన వ్యక్తిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం, మంత్రి అనుచరుడు దాడి చేయడం దుమారం రేపింది. ఇదంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా, సమస్యల గురించి ప్రశ్నిస్తే ఇంత దారుణంగా దాడి చేస్తారా? అని మంత్రిపై స్థానికులు మండిపడుతున్నారు. మంత్రి ముందే ఆయన అనుచరుడు దాడికి పాల్పడినా.. మంత్రి అడ్డుకోకపోవడం దారుణం అంటున్నారు. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అధికార పార్టీ నేతపై ప్రతిపక్ష బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. నువ్వు మంత్రివా? వీధి రౌడీవా? అని నిలదీశారు. సమస్యల గురించి ప్రశ్నిస్తే కొట్టి చంపేస్తారా? అని ఫైర్ అయ్యారు. సదరు మంత్రిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.
पश्चिम बंगाल पंचायत चुनाव से पहले ममता बनर्जी के ‘दीदीर सुरक्षा कवच’ प्रोग्राम में शिकायत करने वाले शख़्स को TMC कार्यकर्ताओं ने पीट डाला। यह कैसा सुरक्षा कवच हुआ ममता जी? pic.twitter.com/SnuGt7FfpG
— Shobhna Yadav (@ShobhnaYadava) January 14, 2023