Female Engineer Amba Seoul : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు తాకబోయిన మహిళా ఇంజినీర్‌‌కు షాక్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్తాన్ టూర్ లో ఓ మహిళా అధికారి చేసిన పని తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ మహిళా అధికారి తీరుపై రాజస్తాన్ సర్కార్ సీరియస్ అయ్యింది. ఆమెపై చర్యలు తీసుకుంది. సస్పెన్షన్ వేటు వేసింది. ఇంతకీ ఆ మహిళా అధికారి ఏం చేసిందంటే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించింది. ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా ఆ అధికారిణి వ్యవహరించిందంటూ రాజస్థాన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Female Engineer Amba Seoul : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు తాకబోయిన మహిళా ఇంజినీర్‌‌కు షాక్

Female Engineer Amba Seoul : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్తాన్ టూర్ లో ఓ మహిళా అధికారి చేసిన పని తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ మహిళా అధికారి తీరుపై రాజస్తాన్ సర్కార్ సీరియస్ అయ్యింది. ఆమెపై చర్యలు తీసుకుంది. సస్పెన్షన్ వేటు వేసింది. ఇంతకీ ఆ మహిళా అధికారి ఏం చేసిందంటే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించింది. ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా ఆ అధికారిణి వ్యవహరించిందంటూ రాజస్థాన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

జనవరి 4న ద్రౌపది ముర్ము రాజస్థాన్ పర్యటనకు వచ్చారు. రోహెత్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో అంబా సియోల్ అనే మహిళా జూనియర్ ఇంజినీర్ ముర్ము పాదాలను తాకేందుకు ప్రయత్నించింది. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు వేచి ఉన్న అధికారులను దాటుకుని వెళ్లి మరీ ఆమె పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఆమెను ముర్ము భద్రతా సిబ్బంది నిలువరించారు.

ఈ ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖ రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో, అంబా సియోల్ పై రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సివిల్ సర్వీసెస్ నియామవళి ప్రకారం రూల్ నెం.958ని అనుసరించి ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.

రాజస్తార్ టూర్ లో భాగంగా రాష్ట్రపతి వచ్చారు. హెలికాప్టర్ దిగారు. ఆమెకు అధికారులు స్వాగతం పలికారు. కొందరు పోలీసు అధికారులు ఆమెకు సెల్యూట్ చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మహిళా ఇంజినీర్.. సడెన్ గా ముందుకెళ్లి రాష్ట్రపతి పాదాలను తాకబోయారు. అయితే, రాష్ట్రపతి తన చెయ్యి అడ్డంగా పెట్టి ఆమెను వారించారు.

ఇంతలో అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది.. ఆ ఇంజినీర్ ను వారించారు. ఇదంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. కేంద్రం దీన్ని సీరియస్ గా తీసుకుంది. దీంతో హద్దు మీరిన ఆ మహిళా అధికారిణిపై రాజస్తాన్ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. కాగా, అంబా సియోల్.. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో జూనియర్ ఇంజినీర్ గా ఉన్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం చెప్పింది.