Anushka Sharma: బృందావన్‌ దామ్‌‌లో కోహ్లికి ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ హితోపదేశం

ఈ ఏడాదిలో ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్‌ని కోహ్లి దంపతులు కలవడం ఇది రెండోసారి.

Anushka Sharma: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా రిటైర్ అయ్యాడో లేదో అలా ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయాడు కోహ్లి. అనుష్క శర్మ, విరాట్ దంపతులు ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌ దామ్‌ను సందర్శించారు. ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్‌ మహారాజ్‌ కలిశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కోహి-అనుష్క జంటకు ఆయన ఆధ్యాత్మిక బోధనలు చేశారు. దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువులలో ప్రేమానంద్ మహారాజ్ ఒకరు.

ఈ ఏడాదిలో ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్‌ని కోహ్లి దంపతులు కలవడం ఇది రెండోసారి. జనవరిలో ఒకసారి గురువును కలిశారు. ఇక 2023 జనవరిలోనూ వీరిద్దరూ మహారాజ్ ని కలిశారు. కెల్లీ కుంజ్ ఆశ్రమంలో ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్‌ ఆధ్యాత్మిక ప్రవచనాలను కోహ్లి దంపతులు శ్రద్ధగా విన్నారు.

ఆధ్యాత్మిక గురువును కలిసిన సమయంలో అనుష్క శర్మ భావోద్వేగానికి లోనవుతున్నట్లు కనిపించారు. ఇది గమనించిన ప్రేమానంద్ మహారాజ్ ఆ జంటకు ఆధ్యాత్మిక బోధనలు చేశారు.

Also Read: వార్నీ.. అన్ని నెల‌లు ఆగాలా.. కోహ్లీ, రోహిత్ ల‌ను టీమ్ఇండియా జెర్సీలో చూసేందుకు..

ఆధ్యాత్మిక గురువు బోధనలు చేస్తుండగా.. మధ్యలో అనుష్క శర్మ ఆయనను ఒక ప్రశ్న అడిగారు. “బాబా..క్యా నామ్ జప్ సే హో జాయేగా?”(బాబా..నామ జపం వల్ల ప్రయోజనం ఉంటుందా) అని అడిగారు. దానికి గురువు ఇలా సమాధానం ఇచ్చారు. “పూర్తిగా… నేను దీన్ని నా జీవిత అనుభవం నుండి పంచుకుంటున్నా. నేను సాంఖ్య యోగం, అష్టాంగ యోగం, కర్మ యోగాలను అనుభవించిన తర్వాత భక్తి యోగానికి వచ్చాను” అని ఆధ్యాత్మికు గురువు బదులిచ్చారు.