Powers Of Enforcement Directorate : ఈడీ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చా? అధికారాలు ఏంటి?

దర్యాఫ్తు సంస్థలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని ఆరోపిస్తున్నాయి?

Powers Of Enforcement Directorate : ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. సీఎం హోదాలో ఉన్న కేజ్రీవాల్ అరెస్ట్ పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దర్యాఫ్తు సంస్థలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని ఆరోపిస్తున్నాయి? ఇందులో ఉన్న నిజం ఎంత? ఈడీకున్న అధికారాలు ఏంటి? ప్రధాని, ముఖ్యమంత్రి సహా ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం ఈడీకి ఉందా?

అలా పవర్‌ఫుల్‌గా మారిన ఈడీ..
2019లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లో మార్పులు వచ్చాయి. ఈడీకి మనీ లాండరింగ్ కేసుల్లో ప్రత్యేక అధికారాలు కల్పించింది. అలా ఈడీ పవర్ ఫుల్ గా మారింది. తనిఖీలు, సోదాలు, అరెస్ట్ చేసేందుకు అధికారం ఇచ్చింది. అంతకుముందు ఇతర దర్యాఫ్తు సంస్థలు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో మనీ లాండరింగ్ కు సంబంధించిన సెక్షన్లు ఉంటే మాత్రమే ఈడీ జోక్యం చేసుకునేది. పీఎంఎల్ఏ చట్టంలో చేసిన మార్పులతో ఈడీ స్వయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయొచ్చు. పీఎంఎల్ఏలో చేర్చిన 45వ సెక్షన్ ప్రకారం వారెంట్ లేకుండానే ఏ వ్యక్తిని అయినా ఈడీ అరెస్ట్ చేయొచ్చు.

ఎఫ్ఐఆర్ కాపీ పొందే వీలు లేదు..
సాధారణంగా పోలీసులు సమన్లు జారీ చేస్తే ఆ వ్యక్తిని సాక్షిగా పిలుస్తున్నారో లేదా నిందితుడిగా పిలుస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. కానీ, ఈడీ జారీ చేసే సమన్లలో ఆ వివరాలను తెలియపరచాల్సిన అవసరం లేదు. పీఎంఎల్ఏకు సంబంధించినంత వరకు మేజిస్ట్రేట్ కు ఈడీపై పర్యవేక్షణ అధికారం లేదు. సాధారణ ఎఫ్ఐఆర్ లతో నిందితులకు ఎఫ్ఐఆర్ కాపీని పొందే హక్కు ఉంటుంది. కానీ, మనీలాండరింగ్ కేసులో నిందితుడికి కాపీని పొందే వీలు లేదు. ఈడీ ఆ కేసులో చార్జిషీటు ఫైల్ చేసేంత వరకు తనపై ఏ సెక్షన్ల కింద అభియోగాలు మోపారో నిందితుడికి తెలియదు.

బెయిల్ దొరకడం కష్టమే..
నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితులపైనే ఉంటుంది. ముఖ్యంగా ఎఫ్ఐఆర్ లేనప్పుడు నిందితులకు బెయిల్ పొందడం కూడా కష్టంగా మారుతుంది. ఎఫ్ఐఆర్ లేకుండా తనమీద మోపిన ఆరోపణలపై నిందితుడు న్యాయస్థానంలో వాదించడం సాధ్యం కాదు. గత కొంత కాలంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇలా పలువురు నాయకులను మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్ట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి.

Also Read : వైసీపీ వ్యూహం ఏంటి? టీడీపీ ప్రణాళిక ఏంటి? ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంత?

 

ట్రెండింగ్ వార్తలు