Ap Lok Sabha Elections 2024 : వైసీపీ వ్యూహం ఏంటి? టీడీపీ ప్రణాళిక ఏంటి? ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంత?

టీడీపీ లిస్టులో నాలుగు నియోజకవర్గాలకు ఎందుకు చోటు దక్కలేదు? కాకినాడ నుంచి పవన్ పోటీ చేస్తారా?

Ap Lok Sabha Elections 2024 : వైసీపీ వ్యూహం ఏంటి? టీడీపీ ప్రణాళిక ఏంటి? ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంత?

Ap Lok Sabha Elections 2024 : ఏపీలో లోక్ సభ ఫైట్ ఎలా జరుగుతోంది? ప్రధాన పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? వైసీపీ పెండింగ్ లో పెట్టిన అనకాపల్లి క్యాండిడేట్ ఎవరవుతారు? టీడీపీ లిస్టులో నాలుగు నియోజకవర్గాలకు ఎందుకు చోటు దక్కలేదు? బీజేపీ పరిశీలనలో ఉన్న నేతలు ఎవరు? కాకినాడ నుంచి పవన్ పోటీ చేస్తారా? ఏపీ లోక్‌సభ ఫైట్‌పై స్పెషల్ అనాలసిస్..

ఏపీలో పార్లమెంట్ ఫైట్ పై క్లారిటీ వచ్చింది. ఇప్పటికే వైసీపీ 24 మంది అభ్యర్థులను ప్రకటించిగా.. టీడీపీ 13మందితో లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. కూటమి సర్దుబాటులో భాగంగా మిత్రపక్షాలకు 8 సీట్లు వదిలేసింది టీడీపీ. ఇందులో జనసేన 2, బీజేపీ 6 చోట్ల పోటీ చేయనున్నాయి. ఇక, టీడీపీ నాలుగు చోట్ల అభ్యర్థులను పెండింగ్ లో పెట్టగా.. బీజేపీ ఒక్కరినీ ప్రకటించలేదు. జనసేన నుంచి కాకినాడ, మచిలీపట్నం నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారైనా.. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. టీడీపీ ప్రకటించిన నియోజకవర్గాల్లోనూ ఇంకా పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాల్లో పోటీ ఎలా ఉండనుంది?

నియోజకవర్గాల వారీగా టీడీపీ, వైసీపీ అభ్యర్థులు..

శ్రీకాకుళం
పేరాడ తిలక్ – వైసీపీ
రామ్మోహన్ నాయుడు – టీడీపీ
గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచిన రామ్మోహన్ నాయుడు

విశాఖపట్నం
బొత్స ఝాన్సీలక్ష్మి – వైసీపీ
మాత్కుపల్లి భరత్ – టీడీపీ
విశాఖ నుంచి కొత్తగా పోటీ చేస్తున్న ఝాన్సీలక్ష్మి

అమలాపురం
రాపాక వరప్రసాద్ – వైసీపీ
గంటి హరీశ్ మాధుర్ – టీడీపీ
సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టిన వైసీపీ

ఏలూరు
కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ – వైసీపీ
పుట్టా మహేశ్ యాదవ్ – టీడీపీ
ఏలూరులో తెరపైకి ఇద్దరూ కొత్త అభ్యర్థులే

విజయవాడ
కేశినేని నాని – వైసీపీ
కేశినేని చిన్ని – టీడీపీ
అన్నదమ్ముల మధ్య పోటీ

గుంటూరు
కిలారు రోశయ్య – వైసీపీ
పెమ్మసాని చంద్రశేఖర్ – టీడీపీ
ఎన్ఆర్ఐని రంగంలోకి దింపిన టీడీపీ

నరసరావుపేట
అనిల్ కుమార్ యాదవ్ – వైసీపీ
లావు శ్రీకృష్ణదేవరాయలు – టీడీపీ
నరసరావుపేటలో వైసీపీ బీసీ వ్యూహం

బాపట్ల
నందిగం సురేశ్ – వైసీపీ
టి.కృష్ణప్రసాద్ – టీడీపీ
బీజేపీ నేతకు టికెట్ ఇచ్చిన టీడీపీ

నెల్లూరు
విజయసాయిరెడ్డి – వైసీపీ
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి – టీడీపీ
ఇద్దరు మిత్రుల మధ్య ఆసక్తికర పోటీ

కర్నూలు
బీవై రామయ్య – వైసీపీ
బస్తిపాటి నాగరాజు – టీడీపీ
ఇద్దరూ కొత్త అభ్యర్థులే

నంద్యాల
పోచా బ్రహ్మానందరెడ్డి – వైసీపీ
బైరెడ్డి శబరి – టీడీపీ
బీజేపీ నుంచి వచ్చిన శబరికి టికెట్ ఇచ్చిన టీడీపీ

హిందూపురం
జొలదరాశి శాంత – వైసీపీ
బీకే పార్థసారథి – టీడీపీ
బీజేపీ కోరినా హిందూపురం వదలని టీడీపీ

చిత్తూరు
రెడ్డప్ప – వైసీపీ
దగ్గుమళ్ల ప్రసాదరావు – టీడీపీ
కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చిన టీడీపీ

Also Read : ఆ ముగ్గురు టీడీపీ సీనియర్ల సీట్లపై వీడని సస్పెన్స్.. కారణం ఏంటి?