Priyanka Gandhi : ప్రధాని భద్రతపై ప్రియాంకకు సీఎం వివరణ..బీజేపీ ఫైర్
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిన అంశంపై బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే తాజాగా పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలపై

Priyanka
PM Security : ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిన అంశంపై బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే తాజాగా పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీతో తాను ఫోన్ లో మాట్లాడానని,అసలు మోదీ పంజాబ్ పర్యటనకు వచ్చినప్పుడు ఏం జరిగిందో మొత్తం ఆమెకు ఫోన్ లో వివరించానని సీఎం వ్యాఖ్యానించారు. ప్రధాని భద్రతకు ఎలాంటి ముప్పూ పంజాబ్‌లో లేదన్నారు. ఆయన పూర్తిగా సురక్షితంగా ఉన్నారని, ఆయన సమీపానికి ఎవరూ వెళ్లలేదని చెప్పారు.
అయితే సీఎం చన్నీ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే బీజేపీ విమర్శలకు దిగింది. ప్రధాని భద్రత గురించి ప్రియాంక గాంధీకి సీఎం చన్నీ వివరించాల్సిన అవసరం ఏముందని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. సంబిత్ పాత్ర తన ట్వీట్ లో..”ప్రియాంక గాంధీ ఎలాంటి రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నారు. ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఆమె ఎవరిపై నిఘా ఉంచాలి? చన్నీ సాబ్ ..నిజం చెప్పు..పని జరిగిపోయింది..మీరు చెప్పినట్లు అలాగే జరిగింది అని మీరు ఆమెతో చెప్పి ఉంటారు”తెలిపారు.
ALSO READ S.Thaman: థమన్ మ్యూజిక్ చేసే సినిమాలు.. ఈ పండగకి అప్డేట్స్ లేనట్లేనా?
A sitting CM briefs Priyanka Vadra on PM’s security!
Why?
What constitutional post does Priyanka hold & who’s She to be kept on loop regarding PM’s security?
Channi Saab ..be truthful..you must have said to her “काम हो गया सी …आपने जो बोला था,वो हो गया!” https://t.co/52pyIu4ccs— Sambit Patra (@sambitswaraj) January 9, 2022