జాబ్‌లు పోతున్నాయ్.. వలస కార్మికులు చనిపోతున్నారు.. మీరు చేసిన సర్వీస్ ఎక్కడ.. మోడీని ప్రశ్నిస్తున్న ఒవైసీ

ఏఐఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశ్నల వర్షం కురిపించారు. కరోనా వైరస్ సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సందేహాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో నడుస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. గురించి యోగికి చెందిన థాక్ దెంగే పాలసీ అని ఇటీవల 8మంది పోలీసులను కాన్పూర్ లో జరిగిన ఘటనను గుర్తు చేశారు.
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వారి పనితీరును ప్రశ్నించారు. రాజ్యాంగపరంగా పీఎం మోడీ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ప్లానింగ్ లేకుండా లాక్‌డౌన్ అమలు చేశారు. ఇలా చేయడం వల్ల 10కోట్ల మందికి దేశవ్యాప్తంగా ఉద్యోగాలు లేకుండాపోయింది. ప్రజల ఆదాయాన్ని తగ్గిపోయింది. 150మంది వలస కార్మికులు కరోనా సంక్షోభ సమయంలో ప్రాణాలు కోల్పోయాు.
ఇక మీరు చేసిన సర్వీసు ఎక్కడుంది? అని మోడీని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన కాన్పూర్ ఎన్‌కౌంటర్ లో వికాస్ దూబే అతని గ్యాంగ్ ఎనిమిది మంది యూపీ పోలీసులను చంపేశారు. దీని పూర్తి బాధ్యత యోగి ఆదిత్యనాథ్‌దే.
కాన్పూర్ లో ఏం జరిగింది. పూర్తి బాధ్యత, తప్పు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దే. థాక్ దెంగే పాలసీ.. కింద చంపేశారు. ఎన్‌కౌంటర్ పేరు చెప్పుకుని మనుషులను చంపేస్తున్నారు. సీఎం యోగి అతని పాలసీని మార్చుకోవాలి. తుపాకులతో దేశాన్ని మార్చలేం. రాజ్యాంగపరంగానే దేశాన్ని పాలించాలి. అని ఒవైసీ అన్నారు.