Viral Video : అడవిలో Selfi తీయించుకున్న ఎలుగుబంటి

  • Published By: madhu ,Published On : July 20, 2020 / 01:44 PM IST
Viral Video : అడవిలో Selfi తీయించుకున్న ఎలుగుబంటి

Updated On : July 20, 2020 / 3:05 PM IST
కొన్ని కొన్ని Vidios లు చూస్తే ఔరా నిజమేనా అనిపిస్తుంటుంది. ఎందుకంటే అంత ఖచ్చితత్వంగా ఉంటాయి. మొన్నటికి మొన్న ఓ ఉడుత తనకు నీళ్లు కావాలంటూ..కోరుతున్నట్లు ఉన్న వీడియో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరొక వీడియో వైరల్ అవుతోంది.
యువతి సెల్ఫీ తీసుకుంటుండగా..వెనుక నుంచి వచ్చిన ఎలుగుబంటి కూడా దిగింది. దీనికి సంబంధించిన..వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. నెటిజన్లు మళ్లీ మళ్లీ చూసేలా ఉందా ఈ వీడియో. Susanta Nanda IFS ఈ వీడియోను Twitter వేదికగా..Tweet చేశారు.
ఇద్దరు అడవిలో నిలబడ్డారు. ఫొటోలు తీసుకుంటున్నారు. యువతి సెల్ఫీ తీసుకొనేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ ఎలుగు బంటి. యువతి పక్కన చక్కగా నిల్చొంది. రెండు కాళ్లపై నిలబడి..వెనుక నిలబడి సెల్ఫీ దిగింది.
జంతువులకు కూడా Selfi అంటే ఇష్టమని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. అసలు ఆ యువతి Selfi తీసుకుంటుందనే విషయం దానికి ఏం తెలుసు ? Selfi లో తాను కూడా ఉండాలని ఎలా అనుకుంది ? ఇలాంటి డౌట్స్ ఎన్నో వస్తున్నాయి. ఎలుగుబంటి ఎలా దిగిందో మీరు చూడండి.