Droupadi Murmu: బీజేపీ ప్రెసిడెంట్ అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ఎవరీమె?

గిరిజన జాతి నాయకురాలు ద్రౌపది ముర్ము. జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో మోదీ గవర్నమెంట్ ప్రతిపాదించిన అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు పోటీ ఇవ్వనున్నారు. ఒకవేళ 64ఏళ్ల ద్రౌపది గెలిస్తే.. ఇండియాకు ప్రెసిడెంట్ అయిన తొలి గిరిజన మహిళగా ఘనత సాధిస్తారు.

Droupadi Murmu: బీజేపీ ప్రెసిడెంట్ అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ఎవరీమె?

Droupadi Murmu

Updated On : June 22, 2022 / 8:02 AM IST

 

 

Droupadi Murmu: గిరిజన జాతి నాయకురాలు ద్రౌపది ముర్ము. జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో మోదీ గవర్నమెంట్ ప్రతిపాదించిన అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు పోటీ ఇవ్వనున్నారు. ఒకవేళ 64ఏళ్ల ద్రౌపది గెలిస్తే.. ఇండియాకు ప్రెసిడెంట్ అయిన తొలి గిరిజన మహిళగా ఘనత సాధిస్తారు.

బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ ప్రెసిడెన్షియల్ నామినీగా 20మంది పేర్లను చర్చించింది. అందులో తూర్పు భారతదేశానికి చెందిన, గిరిజన మహిళను ఎంచుకున్నట్లు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు.

ముర్ము జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ గా 2015లో నియమితులయ్యారు. రెండు సార్లు బీజేపీ అభ్యర్థిగా లెజిస్లేటర్ ఎన్నికల్లో ఎంపికయ్యారు. నవీన్ పట్నాయక్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో బీజేపీ సహకారంతో బిజూ జనతా దళ్ అధికారంలో ఉన్న సమయంలో అలా మంత్రిగా సేవలు అందించారు.

Read Also: రాష్ట్రపతి ఎన్నికల్లో త్రిముఖ పోరు? కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా..

ఒడిశా ప్రభుత్వంలో రవాణా, వాణిజ్యం, మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖలను నిర్వహించడం ద్వారా ఆమెకు విభిన్న శాఖల్లో పరిపాలనా అనుభవం ఉంది.

రాజకీయ జీవితాన్ని కౌన్సిలర్‌గా ప్రారంభించిన ఆమె.. తరువాత రాయంగ్‌పూర్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ లేదా NAC వైస్-ఛైర్‌పర్సన్‌గా మారారు. 2013లో ఒడిశాలోని పార్టీ షెడ్యూల్ తెగ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుని స్థాయికి ఎదిగింది.

భువనేశ్వర్ – రమా దేవి మహిళా కాలేజీ నుంచి ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె.. దాదాపు రెండు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉండి సామాజిక సేవలో గడిపారు.