Punjab Congress : రాహుల్ పాకెట్‌‌ను ఎవరు దొంగిలించారు ? హర్ సిమ్రత్ కౌర్ ట్వీట్

ఆయన పర్యటనపై కేంద్ర మాజీ మంత్రి, అకాలీదళ్ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఓ ట్వీట్ చేశారు. హర్ మందిర్ సాహిబ్ లో రాహుల్ గాంధీ పాకెట్ ను కొట్టేశారు ? జెడ్ సెక్యూర్టీ ఉన్న సమయంలో ఆయన

Rahul Gandhi ‘s Pocket : కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేత రాహుల్ గాంధీ పాకెట్ ను ఎవరు దొంగిలించారంటూ కేంద్ర మాజీ మంత్రి, అకాలీదళ్ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ బాదల్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. పంజాబ్ రాష్ట్రంలోని ప్రముఖ నేతలే ఆయన వెంట ఉన్నారని ట్వీట్ లో తెలిపారు. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. ఆమె వ్యాఖ్యలను ఖండించింది. ఇవన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసింది. తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదు అంటూ కౌంటర్ ఇచ్చింది. ఈమె చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Read More : Budget 2022 : పార్లమెంట్ సమావేశాలకు వేళాయే.. ఈసారి రెండు విడతలు

ఐదు రాష్ట్రాల ఎన్నికలు త్వరలో జరునున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో పార్టీని గెలిపించేందుకు నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో కూడా ఆ పార్టీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. అయితే.. ఆయన నాయకత్వాన్ని ఐదుగురు ఎంపీలు వ్యతిరేకించడం కలకలం రేపింది. రాహుల్ తో పాటు గోల్డెన్ టెంపుల్ ని 117 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గోల్డెన్ టెంపుల్ ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలంధర్ లో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ పాల్గొన్నారు.

Read More : Digital ID : ప్రతి భారతీయుడికి ఒకటే డిజిటల్ ఐడీ..! ఆధార్, పాన్ స్థానంలో కొత్త కార్డు…?

అయితే..ఆయన పర్యటనపై కేంద్ర మాజీ మంత్రి, అకాలీదళ్ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఓ ట్వీట్ చేశారు. హర్ మందిర్ సాహిబ్ లో రాహుల్ గాంధీ పాకెట్ ను కొట్టేశారు ? జెడ్ సెక్యూర్టీ ఉన్న సమయంలో ఆయనకు దగ్గరగా ఉన్నది సీఎం చరణ్ జీత్ చన్నీ, ఓపీ సోని, సుఖ్ జిందర్ సింగ్ లు అని తెలిపారు. పవిత్రమైన పుణ్యక్షేత్రానికి చెడ్డ పేరు తీసుకరావడానికి ఇదొక ప్రయత్నమా ? అంటూ ప్రశ్నించారు. ఈ ట్వీట్ పై కాంగ్రెస్ స్పందించింది. పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా ఆమె పోస్టును రీ ట్వీట్ చేశారు. అలాంటిదేమీ జరగనప్పుడు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు