Covid Vaccination: అనుమానాలు ఎన్నో.. వ్యాక్సిన్ ఎవరు వేయించుకోకూడదు?

Who Should Not Take The Coronavirus Vaccine Shots

కరోనా కాటేస్తోంది.. వ్యాక్సిన్ కాపాడుతుందా? సెకండ్ వేవ్ విస్తరిస్తుంది.. వ్యాక్సిన్‌పై మాత్రం అనుమానాలు ఎన్నో.. కరోనా వ్యాక్సిన్ వచ్చినా కూడా కరోనా పీడ మాత్రం దేశాన్ని వదలట్లేదు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ గురించి అనుమానాలు ఎన్నో.. వేసుకున్నా కరోనా వస్తుందంటూ.. వచ్చిందంటూ వస్తోన్న వార్తల మధ్య వ్యాక్సిన్ వేయించుకునేందుకు అవగాహన లేక ఎంతోమంది వేయించుకోవట్లేదు కూడా.. అసలు వ్యాక్సిన్ ఎవరు వేసుకోవాలి.. ఎవరు వేయించుకోకూడదు అనే సందేహాలు కూడా ప్రజల్లో ఉన్నాయి.

ఈ క్రమంలో వ్యాక్సిన్‌లను ఎవరు వేయించుకోవాలి? ఎవరు వేయించుకోకూడదు? అనే ప్రశ్నలు ఉంటే.. వారికోసమే ఈ సమాధానం.. ఎవరికైనా జ్వరం ఉంటే.. పూర్తిగా తగ్గిన తర్వాతనే వ్యాక్సిన్ వేసుకోవాలి. అలర్జీ సమస్యలు ఉంటే కూడా తగ్గిన తర్వాతే వ్యాక్సిన్ వేయించుకోవాలి. మొదటి డోస్‌ తర్వాత ఏవైనా ఇబ్బందులు కనిపిస్తే.. రెండో డోసు తీసుకోకూడదు.

బలహీనమైన వ్యాధినిరోధకత ఉన్నవారు, రోగ నిరోధక శక్తిపై ప్రభావం ఉన్న మందులు వాడేవారు, గర్భిణీలు, అవయవమార్పిడి చేయించుకున్నవారు వ్యాక్సిన్ తీసుకోకూడదు. గర్భిణులు టీకా తీసుకోకూడదు. పిల్లలను కన్న బాలింతలు, పాలు ఇస్తున్న తల్లులు వ్యాక్సిన్‌కి దూరంగా ఉండాలి. ప్లాస్మా థెరపీ తీసుకున్నవారు కనీసం 4 నుంచి 8 వారాల గ్యాప్ తర్వాతే వ్యాక్సిన్ తీసుకోవాలి

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు, HIV పేషెంట్లు, రకరకాల కారణాలతో వ్యాధినిరోధక శక్తి కోల్పోతున్నవారు వ్యాక్సిన్ వేయించుకోవాలి. రక్తం గడ్డకట్టకుండా ఉండే సమస్య కొందరికి ఉంటుంది. అలాంటి వారు వ్యాక్సిన్ వేయించుకోకూడదు.

అయితే అధ్యయనాలు చెబుతున్నదాని ప్రకారం వ్యాక్సిన్ వేయించుకున్నవారికి ఇక కరోనా రాదు అనేది లేదు.. కరోనా రావచ్చు.. రాకపోవచ్చు.. కానీ, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారి నుంచి కరోనా వ్యాపించదు అని నిపుణులు చెబుతున్నారు. అంటే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారు ట్రాన్స్‌మిటర్లుగా మాత్రం ఉండట్లేదు.