యూపీ ప్రజలపై పగబట్టిన తోడేళ్లు, నక్కలు.. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు.. షార్ప్ షూటర్ల వేట!

తోడేళ్ల దాడులు పెరిగిపోవడంతో యూపీ సర్కార్ సీరియస్ యాక్షన్‌కు రెడీ అయింది. కనిపిస్తే కాల్చేయాలని ఆదేశాలు ఇచ్చేసింది. 9 మంది షార్ప్ షూటర్లను కూడా రంగంలోకి దించింది యోగి సర్కార్.

wolf and jackal attacks: ఒకే ఒక్క జిల్లాలో.. 30 గ్రామాలు. తోడేళ్ల పేరు వింటేనే హడలెత్తిపోతున్నాయి. రెండు నెలలుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి తోడేళ్లు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్‌లో తోడేళ్ల విధ్వంసం కొనసాగుతోంది. ఇప్పటికే 12 మందిని పొట్టనపెట్టుకున్నాయి. మరెంతో మందిని గాయపరిచాయి. తోడేళ్ల దాడులు పెరిగిపోవడంతో యూపీ సర్కార్ సీరియస్ యాక్షన్‌కు రెడీ అయింది. కనిపిస్తే కాల్చేయాలని ఆదేశాలు ఇచ్చేసింది. 9 మంది షార్ప్ షూటర్లను కూడా రంగంలోకి దించింది యోగి సర్కార్. అయినా తోడేళ్ల దండయాత్ర కొనసాగుతూనే ఉంది. సీసీ కెమెరాలు, డ్రోన్లు, అటవీ అధికారుల నిఘాకు చిక్కకుండా అటాక్స్ చేస్తూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా షార్ప్ షూటర్లు రంగంలోకి దిగడంతో ఆ 30 గ్రామాల ప్రజలు కాస్త రిలీఫ్‌ అయినా.. తోండేళ్ల భయం వెంటాడుతూనే ఉంది.

పిల్లలను పొట్టనపెట్టుకుంటున్నాయి
తోడేళ్లు మానవ రక్తానికి రుచి మరిగాయి. నరమేథం సృష్టించి.. తిరిగి అడవుల్లోకి వెళ్లి పోతున్నాయి. దాంతో రాత్రికి రాత్రే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. నర మాంసానికి అలవాటైన తోడేళ్లు రోజుకో గ్రామంలో అటాక్‌ చేసి.. ఇంటి ముందుకు ఆడుకుంటున్న చిన్న పిల్లలను పొట్టనపెట్టుకుంటున్నాయి. కంట పడిన పిల్లలను చంపి.. అడవుల్లోకి తీసుకెళ్ళి పీక్క తింటున్నాయి. పరిస్థితి చేయిదాటిపోవడంతో అధికార యంత్రాంగం మొత్తం బహ్రయిచ్‌లోనే పాగా వేసింది. అటవీ ఆఫీసర్లతో పాటు జిల్లా కలెక్టర్.. అందరూ అక్కడే తిష్ట వేశారు. పిల్లల ప్రాణాలే ముఖ్యంగా షార్ప్ షూటర్లను ఫీల్డ్‌లోకి దించేసింది యోగి సర్కార్.

తోడేళ్లు ఊర్ల మీద పడి చిన్నారులను చంపుకు తింటున్న తీరుపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అవి మనిషి రక్తానికి, మాంసానికి అలవాటు పడితే కంట్రోల్ చేయడం కష్టమని.. ఇప్పటికే తోడేళ్ల దాడుల్లో 12మంది చనిపోయారని అంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. అయితే తోడేళ్లు ప్రతీకార చర్యలకు పాల్పడుతాయని చెబుతున్నారు. తోడేళ్ల గూడుకు, లేక వాటి పిల్లలకు హాని జరిగితే ఊరుకోవని, మనుషులపై ప్రతీకారం తీర్చుకునే అలవాటు వాటి సొంతమని అంటున్నారు.

జనంపై తోడేళ్ల ప్రతీకారం
బహ్రయిచ్‌లోని కొందరు గ్రామస్తులు తోడేళ్ల నివాసాల్లో పిల్లలను చూసినట్టు చెప్తున్నారు. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతంలో వరదలు వచ్చాయి. ఘఘరా నది ఉప్పొంగి తోడేళ్ల ఆరు అడుగుల పొడవైన డెన్‌ను ను ముంచెత్తింది. దాంతో తోడేళ్ల పిల్లలు చనిపోయి ఉంటాయని భావిస్తున్నారు అధికారులు. దీంతో ఇప్పుడు తోడేళ్లు జనంపై ప్రతీకారం తీర్చుకుంటున్నాయని అంచనా వేస్తున్నారు. యూపీలోతోడేళ్లు ఇలా చెలరేగి రక్తపాతం సృష్టించడం ఇదే తొలిసారి కాదు. 1996లో ప్రతాప్‌గఢ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పదిమందికిపైగా చిన్నారులపై తోడేళ్లు దాడిచేశాయి. తోడేళ్లు పిల్లలపై దాడి చేసి చంపిన తర్వాత ఆ గ్రామం దగ్గరలో తోడేళ్ల పిల్లల కళేబరాలను గుర్తించారు గ్రామస్తులు.

తోడేళ్ల కట్టడికి ప్రయత్నం
తోడేళ్లకు ఆహారం దొరకనప్పుడు మానవ నివాసాల మధ్య జీవించే వీధి కుక్కుల కోసం వెతుకుతాయి. ఆ సమయంలో మనుషులు కనిపిస్తే పొరపాటున దాడి చేస్తాయంటున్నారు. తర్వాత మనుషులపై దాడి చేయడాన్ని అలవాటు చేసుకుంటాయని అంటున్నారు. వాతావరణ మార్పు వల్లే ఇలా జరుగుతోందని చెప్తున్నారు వైల్డ్‌లైఫ్ సైన్స్ ఎక్స్‌పర్ట్స్. తోడేళ్లు ఈజీగా దొరికే ఫుడ్ కోసం వెతుకుతూ.. మనుషులపై అటాక్ చేస్తున్నాయోమోనని అంచనా వేస్తున్నారు. అయితే తోడేళ్లను కట్టడి చేసేందుకు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు అధికారులు. ఏనుగు పేడకు నిప్పటించడం..దగ్గరలో ఏనుగు లాంటి పెద్ద జంతువులు ఉన్నాయని భ్రమ కల్పించి తోడేళ్లు జనాలకు దూరంగా వెళ్లేలా చూస్తున్నారు అధికారులు. అడవిలో టెడ్డీ బెర్లను పెట్టి తోడేళ్ల గుంపు కదలికలను పసిగట్టే ప్లాన్ కూడా కొనసాగుతోంది. లేటెస్ట్‌గా షార్ప్ షూటర్లు కూడా ఫీల్డ్‌లోకి దిగారు. తోడేళ్ల దాడిని తప్పించుకునేందుకు రెండు నెలలుగా ఆ 30 గ్రామాల ప్రజలు రాత్రింబవళ్లు నిద్రకాసి కాపలాగా ఉంటున్నారు.

షార్ప్ షూటర్ల వేట
ఆపరేషన్ భేడియా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు నక్కలు ఎంటరయ్యాయి. ఇప్పటికే యూపీలో తోడేళ్ల దాడులు టెన్షన్ పెడుతున్నాయి. నరమాంసానికి మరిగిన తోడేళ్లు వరసగా గ్రామాలపై దాడులకు తెగబడుతున్నాయి. మార్చి నుంచి ఇప్పటివరకు 12 మందిని చంపేశాయి. ఇందులో పది మంది వరకు పిల్లలే ఉన్నారని చెబుతున్నారు అధికారులు. 30 మందిని గాయపరిచాయి. ప్రస్తుతం ఈ మ్యాన్ ఈటర్స్‌ని పట్టుకునేందుకు ఏకంగా ప్రభుత్వం 2 వందల మంది అటవీ, పోలీస్ అధికారుల్ని రంగంలోకి దించారు. ఇప్పటికే నాలుగు తోడేళ్లను బంధించినా దాడులు ఆగడం లేదు. చివరకు యూపీ సర్కార్ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను కూడా జారీ చేసింది.

తోడేళ్లకు తోడైన నక్కలు
ఇప్పటికే తోడేళ్ల గుంపు దాడులతో హల్‌చల్ చేస్తుండగా.. ఇప్పుడు నక్కలు కూడా అటాక్స్ చేస్తున్నాయి. రాష్ట్రంలోని పిలిభిత్ జిల్లాలో రెండు గ్రామాల్లో నక్కలు దాడులు చేశాయి. ఐదుగురు చిన్నారులతో సహా కనీసం 12 మంది గాయపడ్డారు. జహనాబాద్ ప్రాంతంలోని సుస్వార్, పన్సోలి గ్రామాల్లో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులపై నక్కలు అటాక్ చేశాయి. చిన్నారులను కాపాడేందుకు కొందరు వృద్ధులు వెళ్లగా వారిపై కూడా దాడికి తెగబడ్డాయి. నక్కల దాడిలో గాయపడిన 12 మందిని హాస్పిటల్‌లో చేర్చారు. నక్కల దాడిలో చిన్నపిల్లలు గాయపడటంతో.. ఓ దానిని చంపారు గ్రామస్తులు.

ఓ వైపు నక్కలు.. ఇంకోవైపు తోడేళ్ల దాడులతో 30 గ్రామాల్లో భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఎప్పుడేం జరుగుతోంది తెలియని పరిస్థితి ఉంది. ఆరు తోడేళ్లతో కూడిన గుంపు తిరుగుతున్నట్లు గుర్తించారు. వాటి కోసం సెర్చింగ్ నడుస్తోంది. ఉచ్చులు బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్లతో ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తోడేళ్లు ఎప్పటికప్పుడు తాము ఉండే చోటు మారుస్తుండటంతో.. వాటిని బంధించడం కష్టమవుతోంది. థర్మల్ సెన్సార్ కెమెరాల సాయంతో తోడేళ్లను గుర్తించే పనిలో ఉన్నారు అటవీ సిబ్బంది.

నర మాంసానికి అలవాటు పడి..
ఓవైపు తోడేళ్లు.. మరోవైపు నక్కలు వనం విడిచి జనాలపై అటాక్ చేయడానికి కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. బహ్రెచ్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో అడవిలో తోడేళ్ల పిల్లలు వరదలో కొట్టుకుపోవడంతో పాటు.. నక్కలకు నివాసం లేకుండా పోయిందని అంచనా వేస్తున్నారు. అందుకే నిలువనీడ కోసం తోడేళ్లు, నక్కలు గ్రామాల బాటపట్టాయని ఈ క్రమంలో మనుషులపై దాడులు చేస్తున్నాయని చెప్తున్నారు అటవీ అధికారులు. ఈ నేపథ్యంలోనే తోడేళ్లు మనుషుల రక్తానికి మరిగాయి. నర మాంసానికి కూడా అలవాటు పడ్డాయి. వరుస పెట్టి దాడులు చేస్తూ చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి.

Also Read: తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది.. ఇక వీళ్లు ఇంత పెద్ద పాముని పట్టిన తీరు చూస్తే..

అడవుల్లో ఉండే అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో తోడేలు కూడా ఒకటి. ఎప్పుడు గుంపుగా ఉండే తోడేళ్లు.. సింహాలు, పులులను కూడా కొన్నిసార్లు వేటాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అలాంటిది తోడేళ్ల గుంపు ఏకంగా మనుషులపై దాడి చేయడం మనుషులను పీక్కు తింటుడం ఆందోళన కలిగిస్తోంది. నక్కలు కూడా అటాక్ చేస్తుండటంతో బహ్రాయిచ్ జిల్లా జనాలను వణికిస్తోంది. త్వరలో నక్కలను పట్టుకునేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు అధికారులు.

ట్రెండింగ్ వార్తలు