Video: తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది.. ఇక వీళ్లు ఇంత పెద్ద పాముని పట్టిన తీరు చూస్తే..

ఆ పాము 11 అడుగుల పొడవు, 6.7 కిలోల బరువు ఉందని..

Video: తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది.. ఇక వీళ్లు ఇంత పెద్ద పాముని పట్టిన తీరు చూస్తే..

పాము మన పక్కకు వస్తే ఎలా ఉంటుంది? ఇది తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది కదూ? అటువంటిది 11 అడుగుల భారీ పొడవు ఉన్న కోబ్రా ఓ ఇంట్లోకి ప్రవేశించింది. దాన్ని సంబంధిత సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని తీసుకెళ్లారు.

ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని బాంగ్రా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాంగ్రా గ్రామంలోని ఒక ఇంట్లో కింగ్ కోబ్రా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని సంబంధిత అధికారి శ్రీకాంత మొహంతి తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే తమ సిబ్బంది గ్రామానికి వెళ్లారని వివరించారు.

ఆ పామును పట్టుకుని దగ్గరలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు చెప్పారు. ఆ పాము 11 అడుగుల పొడవు, 6.7 కిలోల బరువు ఉందని అన్నారు. ఇంటి వద్ద వారు ఆ కోబ్రాను పట్టుకుంటున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంత పెద్ద పాముని వారు పట్టుకున్న తీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గతంలోనూ ఆ సిబ్బంది అనేక ప్రాంతాల్లో పాములను పట్టుకుని తీసుకెళ్లారు.

Also Read: పాక్ సైనిక పరీక్ష ఇంటర్వ్యూలో హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ఎలాంటి ప్రశ్న అడిగాడో చూడండి..