పాక్ సైనిక పరీక్ష ఇంటర్వ్యూలో హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ఎలాంటి ప్రశ్న అడిగాడో చూడండి..
‘ఆ దాడిని ఎలా ఆపాలన్న విషయం కత్రినా కైఫ్‌కు తెలుసని అనుకుందాం’ అని అన్నాడు.
పాకిస్థాన్ సైనిక పరీక్షకు సంబంధించిన మాక్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రశ్న అడిగి ఓ అభ్యర్థిని ఇబ్బంది పెట్టాడు ఇంటర్వ్యూ చేేసే వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్థాన్ మాజీ ఆర్మీ అధికారి సర్మద్ ముహమ్మద్ ఖాన్ ‘వరల్డ్ టైమ్స్ ఫోర్సెస్ అకాడమీ’ని నడుపుతున్నారు. అందులో స్కిల్స్ పెంచుకునే ప్రయత్నంలో అభ్యర్థి అలీ అబ్బాస్ వచ్చాడు. అతడిని మాక్ ఇంటర్వ్యూ చేస్తూ ఖాన్ అడిగిన ప్రశ్న అందరికీ విచిత్రంగా అనిపిస్తోంది.
‘మీకు ఇష్టమైన నటి ఎవరు? అని ఖాన్ అడిగారు. దానికి అభ్యర్థి అలీ అబ్బాస్ సమాధానం చెబుతూ పాకిస్థానీ నటి దుర్ ఎ ఫిషన్ సలీం అని అన్నాడు. ఆమె అంటే ఎందుకు ఇష్టమని తదుపరి ప్రశ్నలను ఖాన్ అడగగా అభ్యర్థి చెప్పాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో ఎవరు ఇష్టమని ఖాన్ అడిగాడు. అందుకు సమాధానంగా కత్రినా కైఫ్ అని అబ్బాస్ చెప్పాడు.
‘పాకిస్థాన్‌పై భారత్ దాడి చేయాలని ప్రణాళిక వేసుకుందని అనుకుందాం. ఆ దాడిని ఎలా ఆపాలన్న విషయం కత్రినా కైఫ్‌కు తెలుసని అనుకుందాం. ఈ పరిస్థితుల్లో కత్రినా కైఫ్ ఆమెతో సన్నిహిత సంబంధం పెట్టుకుంటే ఆ సమాచారం ఇస్తానని అనుకుంటే ఏం చేస్తావు?’ అని ఖాన్ అడిగాడు.
దానికి అబ్బాస్ సమాధానం చెబుతూ.. ‘సర్, దేశ రక్షణ కోసం నేను తప్పకుండా ఆ పని చేయాల్సి ఉంటుంది’ అని అన్నాడు. ‘ఒకవేళ ఇదే పరిస్థితి అఫ్ఘానిస్థాన్ విషయంలో ఏర్పడితే.. నువ్వు అఫ్ఘాన్‌లో ఉంటే, గుల్ ఖాన్ అనే వ్యక్తి కూడా తనతో ఇటువంటి సంబంధమే పెట్టుకోవాలని అడిగితే ఏం చేస్తావు?’ అని ఖాన్ అడిగారు. అబ్బాస్ స్పందిస్తూ.. ఎటువంటి సంబంధం సర్? అని అన్నాడు. దీంతో ఖాన్‌కి ఏం చెప్పాలో తెలియక ఇదేనా నీ క్యారెక్టర్? అని అడిగి ముగించారు. ఖాన్ అడిగిన ప్రశ్నలు సిల్లీగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Pakistan civil service mock interview 😭 pic.twitter.com/HxWdYp032W
— Johns (@JohnyBravo183) August 31, 2024
Also Read: 3 రోజులుగా వరదలోనే కొత్త కార్లు, కోట్ల రూపాయల నష్టం.. విజయవాడలో నీట మునిగిన కార్ల గోడౌన్లు