వితంతువుతో సంబంధం పెట్టుకున్నాడని పబ్లిక్‌గా ఇద్దర్నీ..

ఒకే కమ్యూనిటీకి చెందిన వితంతువుతో రిలేషన్ పెట్టుకున్న వ్యక్తిని, అతనితో పాటు వితంతువును పబ్లిక్‌గా చితకబాదారు. తలలు వంచుకుని, ముఖాలు నల్లబారిపోయాయి. నగ్లా గుర్బాక్ష్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. సమయానికి పోలీసులు రావడంతో వారిని సేవ్ చేయగలిగారు. ఆ సీన్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది.
బాధితుల్లో ఒకరు కంప్లైంట్ చేయడంతో… శనివారం ముగ్గురిని అరెస్టు చేశారు. కాగా మొత్తం 16మందిపై కేసు బుక్ చేశారు. అందులో గుర్తు తెలియని 10మంది మహిళలు కూడా ఉన్నారు. ఐపీసీ సెక్షన్లు 499, 500, 269, 270, 506 సెక్షన్ల ప్రకారం కేసులు బుక్ చేశారు.
https://10tv.in/lata-mangeshkars-building-sealed-by-bmc/
నిందితుల్లో కొందరు పరారీలో ఉన్నారు. మూడేళ్లుగా వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన దాడి తర్వాత ఆమె అతని నుంచి దూరంగా ఉండడానికి రాజీపడింది.