మేం వస్తే..  govt పోస్టులకు పరీక్ష ఫీజు రద్దు

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ అధికార పార్టీ నుంచి అన్ని విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు హమీలు మీద హమీలు గుప్పిస్తున్నారు.

  • Publish Date - April 8, 2019 / 12:54 PM IST

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ అధికార పార్టీ నుంచి అన్ని విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు హమీలు మీద హమీలు గుప్పిస్తున్నారు.

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ అధికార పార్టీ నుంచి అన్ని విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీల నేతలు హమీలు మీద హమీలు గుప్పిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రజలకు ఎన్నికల హామీలు కురిపించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Read Also : Paytm మాల్ ప్లాన్ : 300 మంది ఉద్యోగులు కావాలి

ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసే పరీక్షకు ఫీజు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. దేశ ప్రజల ఆరోగ్య సంక్షేమం దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం.. హెల్త్ కేర్ యాక్ట్ ను కూడా అమల్లోకి తీసుకొస్తామని హమీ ఇచ్చారు. ప్రతి పౌరుడు హెల్త్ కేర్ సర్వీసులన్నింటికి అర్హత పొందేలా గ్యారెంటీ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ పోస్టుల కోసం పరీక్షకు సంబంధించి దరఖాస్తు ఫీజును రద్దు చేస్తామని ఫేస్ బుక్ వేదికగా రాహుల్ స్పష్టం చేశారు. 

మరో పోస్టులో.. ప్రజల సంక్షేమానికి సంబంధించి హెల్త్ కేర్ సమస్య చాలా పెద్దదని, ప్రతి ఒక్కరికి పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు అందేలా చేస్తామన్నారు. హెల్త్ కేర్ పై ప్రభుత్వం పెట్టే మొత్తం ఖర్చుపై దేశ జీడీపీ మూడు శాతం వరకు పెరుగుతుందన్నారు.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ నుంచి రాహుల్ రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.  ఈ రెండు స్థానాలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియలో భాగంగా కేరళలోని వాయ్ నాడ్ ప్రాంతంలో రాహుల్ నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 10న తన సొంత నియోజకవర్గమైన అమేఠిలో కూడా రాహుల్ నామినేషన్ దాఖలు చేయనునున్నారు. 

Read Also : Update చేసుకున్నారా? : వాట్సాప్ లో కొత్త ఫీచర్లు