రసగుల్లా పంపిస్తా కానీ.. మోడీకి మమత బెనర్జీ కౌంటర్

  • Publish Date - April 25, 2019 / 12:39 PM IST

బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌‌తో ఇంటర్వ్యూలో మాట్లాడిన నరేంద్ర మోడీపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  దీదీ(మమత) తనకు అప్పుడప్పుడూ కుర్తాలు, మిఠాయిలు కానుకగా పంపిస్తుంటారని వెల్లడించారు. కాగా మోడీ మాటలపై హూగ్లీ జిల్లాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో మాట్లాడిన మమతా బెనర్జీ సున్నితమైన కౌంటర్ ఇచ్చారు.

‘కొందరికి నేను రసగుల్లలు పంపిస్తుంటాను. వేడుకలు, ప్రత్యేక పూజల సమయంలో వాళ్లకు కానుకలు పంపుతాను. ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు టీ, కాఫీలు కూడా ఇస్తా. కానీ వారికి ఒక్క ఓటు కూడా పడనివ్వను’ అంటూ మోడీ పేరు చెప్పకుండానే కౌంటర్ ఇచ్చింది. పెద్ద నోట్ల రద్ధు పేరుతో నల్ల ధనాన్ని తెల్లధనంగా మోడీ మార్చేశారని మమత మండిపడ్డారు.

బలవంతంగా నోట్లరద్దును మోడీ ప్రజలపై రుద్దారని మమత విమర్శించారు. తెల్లడబ్బుగా మార్చిన నల్ల డబ్బునే మోడీ ఇప్పుడు ఎన్నికల కోసం వాడుతున్నారని, దీదీ విమర్శించారు. వారి జిత్తులు బెంగాల్‌లో సాగనివ్వనని, కానుకల పేరుతో బీజేపీ ఓట్లను కొంటుందని, ప్రజలే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మోడీని పదవి నుంచి దించి రక్షించుకోవాలని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు