పవర్‌లోకి వస్తే ఈసీని జైలులో పెడుతా: బీఆర్.అంబేద్కర్ మనవడు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ మనవడు, భరిప బహుజన్ మహాసంగ్ ఛైర్మన్ ప్రకాశ్ అంబేద్కర్ ఎన్నికల సంఘంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ మనవడు, భరిప బహుజన్ మహాసంగ్ ఛైర్మన్ ప్రకాశ్ అంబేద్కర్ ఎన్నికల సంఘంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ మనవడు, భరిప బహుజన్ మహాసంగ్ ఛైర్మన్ ప్రకాశ్ అంబేద్కర్ ఎన్నికల సంఘంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి ఈసీ అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని, తాము అధికారంలోకి వస్తే తమ పవర్‌తో ఈసీని జైలుకు పంపుతామని అన్నారు. ‘‘రాజ్యాంగం ప్రకారం నియమాలు అనుమతిస్తున్నారు కానీ, పుల్వామా ఘటనపై మాట్లాడకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
Read Also : కుప్పంలో జగన్: బీసీ సీటు గుంజుకున్నాడు.. చంద్రబాబుపై గెలిపిస్తే మంత్రిని చేస్తా
మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్నికల సంఘాన్ని వదిలేది లేదని, రెండు రోజుల పాటు వారిని జైల్లో పెడతామని అన్నారు. నిష్పక్షపాతంగా ఈసీ వ్యవహరించట్లేదని, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది’’ అని మండిపడ్డారు.
మహారాష్ట్రలో ఎమ్‌ఐఎమ్, భరిప బహుజన్ మహాసంగ్, జనతాదళ్(ఎస్), ఓవైసీకి చెందిన ఎమ్‌ఐఎమ్ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. వంచిత్ బహుజన్ అగాది అనే కూటమి ఏర్పాటు కాగా.. ప్రకాశ్ అంబేద్కర్ ఈ కూటమి తరఫున సోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు అకోలా స్థానం నుంచి బరిలోకి దిగారు. మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
Read Also : ఎన్నికల తర్వాత మోడీ జైలుకు: రాహుల్ గాంధీ