ఒంటికాలితో బెంగాల్‌ని.. రెండు కాళ్లతో ఢిల్లీని గెలుస్తా..

కాలికి గాయమైనా వీల్ ఛైర్‌లో ఉండి ప్రచారం చేస్తూ.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దూసుకుని పోతున్న మమతాబెనర్జీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గి తీరుతాను అంటూ.. ధీమా వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. ఈ ఎన్నికల్లో అధికార తృనమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయం సాధిస్తోందని, అందులో ఎటువంటి అనుమానం లేదని అన్నారు.

ఒంటికాలుతో బెంగాల్‌లో విజయం సాధిస్తానని, భవిష్యత్తుల్లో రెండు కాళ్లతో ఢిల్లీలో గెలుస్తానని ఆమె అన్నారు. హుగ్లీలోని దేబనందపూర్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మమత.. బెంగాల్ ఎన్నికలను 8విడతల్లో నిర్వహించవలసిన అవసరం ఏముందని ఈసీని ప్రశ్నంచారు. కరోనా విపరీతంగా విస్తరిస్తోన్న సమయంలో ఎన్నికలు తక్కువ వ్యవధిలో ముగించలేరా? అని ఆమె ప్రశ్నించారు.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేక భారతీయ జనతా పార్టీ.. సీపీఎం, టీఎంసీ నేతలను తెచ్చుకుందని, మంచినీళ్లలా డబ్బులు ఖర్చుపెట్టి వాళ్లను గెలిపించే ప్రయత్నాలు చేస్తుందని ఆమె అన్నారు.

ట్రెండింగ్ వార్తలు