Earth Hour : గంట సేపు కరెంటు బంద్ చేస్తే..పిజ్జా ఫ్రీ

ఎర్త్ అవర్ కార్యక్రమంలో భాగంగా...గంట వరకు విద్యుత్ ను వినియోగించుకోకుండా..బంద్ చేయాలని, ఇలా చేసిన వారికి ఫ్రీగా పిజ్జా అందిస్తామని వెల్లడించింది.

Earth Hour : గంట సేపు కరెంటు బంద్ చేస్తే..పిజ్జా ఫ్రీ

Current

Updated On : March 27, 2021 / 7:14 PM IST

WIN A Free Pizza : పర్యావరణ పరిరక్షణలో భాగంగా పిజ్జా హట్ ముందుకు వచ్చింది. ఎర్త్ అవర్ కార్యక్రమంలో భాగంగా…2021, మార్చి 27వ తేదీ శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు విద్యుత్ ను వినియోగించుకోకుండా..బంద్ చేయాలని, ఇలా చేసిన వారికి ఫ్రీగా పిజ్జా అందిస్తామని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా…వ్యక్తులు, వ్యాపార సంస్థలన్నీ…విద్యుత్ వాడకాన్ని ఓ గంట సేపు పూర్తిగా ఆపేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఇలా చేయడం వల్ల ఎంతగానో విద్యుత్ ఆదా అవుతుందని తెలిపింది. వాతావరణంలో నెలకొంటున్న వాతావరణ మార్పులను ఎదుర్కొవడానికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమని నొక్కి చెబుతోంది.

ఎర్త్ అవర్….ప్రతి సంవత్సరం మార్చి నెలలో లాస్ట్ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఆ రోజు రాత్రి ఓ గంట సేపు కరెంటును వినియోగించుకోరు. లైట్లు, వైఫై, మొబైల్ డేటా, సెల్ ఫోన్, ఇతర నెట్ వర్క్, కరెంటుతో నడిచే వాటిని బంద్ చేస్తారు. దీనివల్ల భూమికి లబ్ది చేకూరుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. వనరులు, కాలుష్యం, ఉత్పత్తి వ్యయం ఇతర ఖర్చులు మిగలుతాయని వెల్లడిస్తున్నారు. అయితే..ఈ కార్యక్రమంలో చాలా కొద్ది మంది మాత్రమే పాల్గొంటున్నారని, మరింత ఎక్కువ మంది పాల్గొనే విధంగా ‘ఫ్రీ పిజ్జా’ అంటూ ముందుకొచ్చింది.

గంట పాటు విద్యుత్ వాడకాన్ని, మొబైల్ డేటాను పూర్తిగా ఆపేసిన వారికి మాత్రమే ఫ్రీ పిజ్జా లభించనుందని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. ఇందుకు పిజ్జా హట్ ప్రత్యేకంగా వెబ్ సైట్ (www.offlinehour.me) ఏర్పాుట చేసింది. ఈ వెబ్ సైట్లో పేర్లు నమోదు చేసుకున్న వారికి పిజ్జా ఉచితంగా ఉంటుందని వెల్లడించారు. భూమిని సంరక్షించుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేయాలని పిలుపునిస్తున్నారు. అంతేగాకుండా..ఉచితంగా పిజ్జా కూడా గెల్చుకోవచ్చని పిజ్జా హట్ ప్రచారం చేస్తోంది.