ఉప్పొంగె మనస్సు : సూపర్ హీరో పేరంట్స్ కు ప్లయిట్ లోనే సత్కారం

  • Published By: venkaiahnaidu ,Published On : March 1, 2019 / 04:51 AM IST
ఉప్పొంగె మనస్సు : సూపర్ హీరో పేరంట్స్ కు ప్లయిట్ లోనే సత్కారం

Updated On : March 1, 2019 / 4:51 AM IST

మీరు గ్రేట్ పేరంట్స్.. సూపర్ హీరోను కన్న తల్లిదండ్రులు.. ఈరోజు దేశ గౌరవాన్ని కాపాడారు.. ఇదే మా సత్కారం అంటూ అభినందన్ తల్లిదండ్రులను అద్భుత రీతిలో సత్కరించారు ప్రయాణికులు. అభినందన్ విడుదల అవుతున్న క్రమంలో అతని పేరంట్స్ చెన్నై నుంచి ఢిల్లీకి ఫ్లయిట్ లో వచ్చారు. వారు ఫ్లయిట్ ఎక్కిన తర్వాత.. అభినందన్ పేరంట్స్ అని తెలుసుకున్న ప్రయాణికులు ఒకింత ఉత్కంఠకు లోనయ్యారు. విమానంలోనే నిల్చొని చప్పట్లతో అభినందించారు. కొందరు అయితే సత్కారం కూడా చేశారు. గ్రేట్ పేరంట్స్ అంటూ కొనియాడారు. ప్రయాణికుల నుంచి వచ్చిన స్పందన చూసి.. అభినందన్ పేరంట్స్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. 

పాక్ నిర్బంధంలో ఉన్న భారత పైలట్ విక్రమ్ అభినందన్ ను శుక్రవారం(మార్చి-1,2019) విడుదల చేస్తామని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురువారం ఆ దేశ పార్లమెంట్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. అభినందన్ రాక కోసం దేశమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తుంది. రియల్ హీరో ఢిల్లీలో అడుగుపెట్టబోతున్నాడంటూ దేశ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి.

ఈ సమయంలో తమ కొడుకును చూసేందుకు అభినందన్ తల్లిదండ్రులు రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఎస్ వర్థమాన్,శోభా వర్థమాన్ లు గురువారం రాత్రి విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. పాక్ సైన్యం దగ్గర ఉన్నాకూడా కర్తవ్యం మరువని అభినందన్ ధైర్యసాహసాలకు మంత్రముగ్థులైన మిగతా ప్రయాణికులు చప్పట్లతో ఆయన తల్లిదండ్రులను విమానంలోకి ఆహ్వానించారు. లేచి నిలబడి వారికి స్వాగతం పలికారు. శుక్రవారం(మార్చి-1,2019) అభినందన్ ఢిల్లీకి చేరుకోనున్నాడు.