Viral Video: హమ్మయ్య బతికిపోయాం.. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.. వీడియో వైరల్

ప్రయాణికులు ప్రయాణ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రైలు ఎక్కే సమయంలో, దిగే సమయంలో రైల్వే శాఖ సూచనలు పాటించాలి. అలాకాకుండా అతి ఉత్సాహం, తొందరపాటు తనం ప్రదర్శిస్తే మన ప్రాణాలకే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నవారం అవుతాం. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Trine

Viral Video: ప్రయాణికులు ప్రయాణ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రైలు ఎక్కే సమయంలో, దిగే సమయంలో రైల్వే శాఖ సూచనలు పాటించాలి. అలాకాకుండా అతి ఉత్సాహం, తొందరపాటు తనం ప్రదర్శిస్తే మన ప్రాణాలకే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్న వారం అవుతాం. తాజాగా కొందరు రైల్వే ప్రయాణికులు తొందరపాటు నిర్ణయంతో ప్రమాదం అంచుకు వెళ్లారు. చివరిలో అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకొని ఊపిరిపీల్చుకున్నారు.

Haryana: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రైలు ఢీకొని బీఎస్ఎఫ్ జవాన్ మృతి..

స్టేషన్ కు కొద్దిదూరంలో ట్రైన్ ను నిలిచిపోయింది. కొందరు ప్రయాణికులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారుదిగే ప్రాంతం అక్కడే ఉండటంతో రైలుదిగి వెళ్లేందుకు ప్రయత్నించారు. పక్కనే పట్టాలు దాటుకొని వెళ్తున్నారు. కొందరు అలా వెళ్లగా.. మరికొందరు పట్టాలు దాటుతున్నారు. ట్రైన్ లో ఉండి ఈ దృశ్యాలను వీడియో తీస్తున్న వ్యక్తి పక్క ట్రాక్‌పై మరో ట్రైన్‌ వస్తుందని చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు.

ఈ క్రమంలోనే ఓ కుటుంబ సభ్యుల్లో భయాందోళన నెలకొంది. పట్టాలకు అవతలివైపు తమ లగేజీని పడేసిన ఓ మహిళ మళ్లీ తిరిగి ఈ వైపునకు వచ్చే ప్రయత్నం చేసింది. రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఐఏఎస్‌ అధికారి అవనీశ్‌ శరన్ ఈ దృశ్యాలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ జీవితం మీది.. నిర్ణయమూ మీదే’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.