Dance Of Death : ఓ మై గాడ్.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తున్న యువతి సడెన్ గా కుప్పకూలి మృతి.. వీడియో వైరల్

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Dance Of Death : మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ, సడెన్ గా వస్తుంది. రెప్పపాటులో ప్రాణం పోతుంది. అప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్న వ్యక్తి సడెన్ గా మృత్యువు ఒడికి చేరతాడు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో అలాంటి సంఘటన చోటు చేసుకుంది. అప్పటివరకు స్టేజ్ పై ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న యువతి సడెన్ గా కుప్పకూలింది. ఆ వెంటనే మరణించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి..
మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిశ జిల్లాలో ఈ విషాదం జరిగింది. సోదరి పెళ్లి వేడుకలో భాగంగా ఓ యవతి స్టేజ్ పై ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తోంది. ఇంతలోనే ఉన్నట్లుండి ఆమె కుప్పకూలింది. ఆ మరుక్షణమే చనిపోయింది. సోదరి పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ఆ యువతి ఇండోర్ నుంచి వచ్చింది. ఆ యువతిని పరిణీత జైన్ గా గుర్తించారు. ఇండోర్ లో నివాసం ఉంటోంది.

Also Read : చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి.. రౌండప్ చేసి, కింద కూర్చోబెట్టి, వార్నింగ్ ఇస్తూ.. షాకింగ్ వీడియో..

ఎవరూ ఊహించని విషాదం..
ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో భాగంగా సంగీత్ ఏర్పాటు చేశారు. సంగీత్ లో పాల్గొన్న పరిణీత జైన్ ఓ పాటకు డ్యాన్స్ చేస్తోంది. పాటకు అనుగుణంగా ఎంతో హుషారుగా స్టెప్స్ వేస్తోంది. అందరూ ఆమె డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బాగా డ్యాన్స్ చేస్తున్నావ్ అని చప్పట్లతో ఆమెను ప్రోత్సహిస్తున్నారు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా ఘోరం జరిగిపోయింది.

 

యువతి మృతికి గుండెపోటే కారణమా?
డ్యాన్స్ చేస్తూ చేస్తూ యువతి ఒక్కసారిగా స్టేజ్ పై అలాగే పడిపోయింది. దీంతో కంగారుపడ్డ బంధువులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. యువతి డ్యాన్స్ చేస్తూ మృతి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యువతి మరణించిన తీరు చూసి అంతా షాక్ కి గురవుతున్నారు. కాగా, యువతి మృతికి గుండెపోటు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Also Read : మెట్రో రైలు ప్రయాణికులకు బిగ్ షాక్.. ఛార్జీలు 50శాతం పెంపు..