Fake Watch : ఆపిల్ వాచ్ ఆర్డర్ ఇస్తే ఫేక్ వాచ్ డెలివరీ .. మహిళకు క్షమాపణలు చెప్పిన అమెజాన్

ఆన్‌లైన్‌లో ఒకటి ఆర్డర్ చేస్తే ఒకటి రావడం లాంటివి చాలా విన్నాం. తాజాగా ఓ మహిళ ఆపిల్ వాచ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టింది. ఫేక్ వాచ్ డెలివరీ కావడంతో ఆమె షాకయ్యింది. ఆ తరువాత ఏం జరిగిందో చదవండి.

Fake Watch : ఆపిల్ వాచ్ ఆర్డర్ ఇస్తే ఫేక్ వాచ్ డెలివరీ .. మహిళకు క్షమాపణలు చెప్పిన అమెజాన్

Fake Watch

Updated On : July 12, 2023 / 12:05 PM IST

Fake Watch : ఓ మహిళ రూ.50,900 విలువ చేసే ఆపిల్ వాచ్ ఆర్డర్ చేసి ఫేక్ వాచ్ పొందిన మోసపోయిన సంఘటన వైరల్ అవుతోంది. తను ఎలా మోసపోయానో చెబుతూ ఆ మహిళ డీటెయిల్స్ మొత్తం సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Patient cheated the doctor : నకిలీ రూ.500 నోటు ఇచ్చి డాక్టర్‌ని మోసం చేసిన పేషెంట్

సనయ అనే మహిళ తను ఆర్డర్ చేసిన ఆపిల్ వాచ్ డీటెయిల్స్‌తో పాటు తనకు వచ్చిన ఫేక్ వాచ్ ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్ (@Sarcaswari) లో షేర్ చేసింది. ఆమె ఆపిల్ వాచ్ (Apple Watch)  సిరీస్ 8 ని రూ.50,900 లకి ఆర్డర్ చేసింది. అయితే ఆపిల్ వాచ్‌కి బదులుగా జూలై 9 న ‘ఫిట్ లైఫ్’ (Fit Life) వాచ్ డెలివరీ అయ్యిందని తెలుసుకుని షాకయ్యింది. అమెజాన్‌కి ఈ విషయం కంప్లైంట్ చేస్తే వాపసు లేదా మార్పిడిని అందించలేమని చెప్పినట్లు ఆమె తన పోస్టులో పేర్కొంది. “అమెజాన్ నుంచి ఎప్పుడూ ఆర్డర్ చేయకండి.. నేను ఆర్డర్ చేసాను ఆపిల్ 8 సిరీస్ చూడండి. 9 వ తేదీన నకిలీ ‘ఫిట్ లైఫ్’ వాచ్ వచ్చింది. అమెజాన్ ఈ సమస్యను పరిష్కరించలేదు’ అంటూ అమెజాన్ హెల్ప్ లైన్ ట్యాగ్‌తో షేర్ చేసింది.

Suchitra Krishnamoorthi : ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. అయినా నా భర్తే నన్ను మోసం చేశాడు..

ఆమె ట్వీట్‌పై అమెజాన్ హెల్ప్ స్పందించి ఆమెకు ట్విట్టర్‌లో క్షమాపణలు చెప్పింది. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు తమ అనుభవాలను పంచుకున్నారు. ఖరీదైన గాడ్జెలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవద్దని ఆమెకు సూచించారు.