Maharashtra: కోడలు టిఫిన్, టీ అందించలేదని తుపాకీతో పేల్చేశాడు!
సమయానికి బ్రేక్ ఫాస్ట్, టీ అందించలేదనే కోపంతో కోడలిని హత్య చేసేందుకు యత్నించాడు ఓ మామ. ఈ ఘటన మహారాష్ట్రలోని థానెలో నమోదైంది. కడుపు భాగంలో బుల్లెట్ గాయాలతో హాస్పిటల్ లో అడ్మిట్..

Maharashtra
Maharashtra: సమయానికి బ్రేక్ ఫాస్ట్, టీ అందించలేదనే కోపంతో కోడలిని హత్య చేసేందుకు యత్నించాడు ఓ మామ. ఈ ఘటన మహారాష్ట్రలోని థానెలో నమోదైంది. కడుపు భాగంలో బుల్లెట్ గాయాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన 42ఏళ్ల మహిళకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నిందితుడు కాశీనాథ్ పాండురంగ్ పాటిల్ అనే నిందితుడిపై సెక్షన్లు 307, 506 ప్రకారం కేసు నమోదు చేశామని సీనియర్ ఇన్‌స్పెక్టర్ సంతోశ్ ఘాటేకర్ తెలిపారు.
బాధితురాలికి తోటికోడలైన మరో మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం 11గంటల 30నిమిషాల సమయంలో ఘటన నమోదైంది. మార్నింగ్ టీతో పాటే తనకు బ్రేక్ ఫాస్ట్ ఇవ్వలేదనే అసహనంతో వాదన మొదలైంది.
“అంతే ఆ పెద్దాయన రివాల్వర్ తీసి కోడలిని కడుపు భాగంలో షూట్ చేశాడు. అలా తీవ్రగాయాలైన మహిళను వెంటనే హాస్పిటల్ కు తీసుకొచ్చారు” అని పోలీస్ అధికారులు తెలిపారు. జరిగిన దాడి పట్ల పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతుంది.
Read Also: మహారాష్ట్రలో వింత ఘటన.. ఉడుముపై సామూహిక అత్యాచారం