Kerala : వేలాదిమంది మహిళలు చేసిన ‘తిరువాతిరకాళి’ నృత్యం చూడాలంటే రెండు కళ్లు చాలవు
ఓనమ్ పండుగ సందర్భంగా కేరళలోని కుట్టనెల్లూరు ప్రభుత్వ కళాశాలలో జరిగిన మెగా తిరువతీర నృత్య ప్రదర్శన అందరినీ కట్టిపడేసింది. వేలాదిమంది మహిళలు పాల్గొన్న ఈ ప్రదర్శన ప్రపంచ రికార్డులు సాధించింది.

Kerala
Kerala : ఓనం సందర్భంగా కేరళలో వేలాది మంది మహిళలు చేసిన ‘తిరువాతిరకాళి’ నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించింది. కుట్టనెల్లూరులో జరిగిన ఈ ప్రదర్శన కన్నులపండుగగా సాగింది.
Anchor Suma : టాలీవుడ్ యాంకర్స్‌కి సుమ ఇంట ఓనమ్ విందు..
కేరళలో 7,027 మంది మహిళలు ఒకేసారి ‘తిరువాతిరకాళి’ నృత్యం చేశారు. కుట్టనెల్లూరు ప్రభుత్వ కళాశాలలో జరిగిన మెగా తిరువతీర నృత్య ప్రదర్శనను నిర్వహించడం ద్వారా కుటుంబశ్రీ మహిళా నెట్ వర్క్ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ నృత్య రూపకాన్ని ఓనం పండుగ సమయంలోనూ మళయాళ మాసం చింగంలో.. అప్పుడప్పుడూ ధనుర్మాసంలో ప్రదర్శిస్తారు. ఈసారి భారీ సంఖ్యలో మహిళలు ఈ ప్రదర్శనలో పాల్గొనడంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ,టాలెంట్ రికార్డ్ బుక్‌లో ఈ ప్రదర్శన చోటు దక్కించుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు కూడా నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ఎంత ముద్దుగా పాడిందో.. మలయాళంలో ఓనమ్ పాట పాడిన అనుపమ..
ఈ నృత్య ప్రదర్శనను రెవెన్యూ మంత్రి కె.రాజన్ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి పెద్ద మహిళా నెట్ వర్క్‌గా పేరున్న కుటుంబశ్రీని ఆమె కొనియాడారు. పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ ఓనమ్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. .