అత్యాచార బాధితులు ఆత్మాభిమానం ఉంటే చనిపోతారు…కేరళ పీసీసీ చీఫ్

  • Published By: venkaiahnaidu ,Published On : November 2, 2020 / 08:49 AM IST
అత్యాచార బాధితులు ఆత్మాభిమానం ఉంటే చనిపోతారు…కేరళ పీసీసీ చీఫ్

Updated On : November 2, 2020 / 10:34 AM IST

Women with self-respect if raped will die కేరళ కాంగ్రెస్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.త్యాచార బాధితురాలిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పిన్నరయి విజయన్ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో… అత్యాచారానికి గురైన మహిళను వ్యభిచారితో పోల్చారు.



సోలార్‌ కుంభకోణం కేసులో పిన్నరయి విజయన్‌ ప్రభుత్వం బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయాలకు పాల్పడుతోందని కేరళ పీసీసీ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ ఆదివారం ఆరోపించారు. తనపై నాటి యూడీఎఫ్‌ మంత్రులు పదే పదే అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై మాట్లాడిన రామచంద్రన్‌…పొద్దున లేచింది మొదలు ఫలానా వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని ఆమె చెబుతోంది. విజయన్‌ ప్రభుత్వం కావాలనే ఇలాంటి ఆరోపణలు చేయిస్తోంది.



https://10tv.in/former-m-p-cm-kamal-nath-makes-derogatory-statement-against-ex-cabinet-minister-imarti-devi/
ఆ పాచికలు ఎంతమాత్రం పారవు. అయినా, ఆత్మగౌరవం ఉన్న ఏ మహిళ అయినా అత్యాచారానికి గురైన మహిళలు ఆత్మాభిమానం ఉంటే ప్రాణాలు తీసుకుంటారని అన్నారు. లేదంటే మరోసారి అత్యాచారం జరగ్గకుండా జాగ్రత్త పడుతుంది. ఆమె వ్యభిచారిలా మాట్లాడుతోందంటూ ఆరోపించారు. అయితే, కాసేపటికే రామచంద్ర తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దంటూ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు.



తన వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉంటే క్షమించాలని కోరారు. కాగా,పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలను కేరళ మంత్రి కేకే శైలజ ఖండించారు. ఆదర్శంగా నిలవాల్సిన వారే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.