Amazing gift : ఓ భార్యకు భర్త ఇచ్చిన బహుమతి చూసి ప్రేమంటే ఇదే.. అంటున్న నెటిజన్లు

భార్యాభర్తలు గిఫ్ట్‌లు ఇచ్చుకోవడంలో పెద్ద విశేషం ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడో చిన్నతనంలో మిస్ చేసుకున్న వస్తువుల్ని కూడా గిఫ్ట్‌గా ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తే అద్భుతంగా ఉంటుంది. కొందరికి సిల్లీగా అనిపించినా ఇలాంటి వాటిల్లోనే వారి నిజమైన ప్రేమ వ్యక్తం అవుతుంది.

Amazing gift

Amazing gift : ఓ మహిళ చిన్నతనంలో తన దగ్గర ఉన్న బార్బీ డాల్ మిస్ చేసుకుంది. ఆ తరువాత అది కలగానే ఉండిపోయింది. అయితే ఆమె భర్త నుంచి తిరిగి బహుమతిగా పొందింది. ఇందిలో విషయం ఏముంది? అనుకుంటున్నారా? ఒక్కోసారి చిన్నగా అనిపించిన విషయాలు చెప్పలేనంత ఆనందాన్ని పంచుతాయి. ఆమె విషయంలో అదే జరిగింది. ఆ డాల్‌తో పాటు అతను రాసిన నోట్ కూడా ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

uttar pradesh : ప్రియురాలి కోసం భార్య ముక్కు కోసి జేబులో వేసుకెళ్లిపోయిన భర్త

ఆడపిల్లలు బార్బీ డాల్ అంటే చాలా ఇష్టపడతారు. చాలామంది దగ్గర బార్బీ డాల్ ఉంటుంది. అంతగా ఇష్టపడే బార్బీ డాల్‌ను కోల్పోయి ఓ మహిళ కలత చెందింది. చిన్నతనంలో ఆమె ఎంతగానో ఇష్టపడ్డ బార్బీ డాల్‌ను ఆమె భర్త గిఫ్ట్‌గా ఇచ్చాడు. @wednesday_94 అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో బార్బీ డాల్ ఫోటోతో పాటు ఆ మహిళ భర్త రాసిన నోట్ కూడా ఉంది. ‘నా ప్రియమైన భార్య ఐషాకు.. నువ్వు కోల్పోయినది చిన్నదైనా.. చాలా కాలం క్రితం అయినా ప్రతిదాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ నీ భర్త.. అని నోట్‌లో రాసి ఉంది.

Marriage Breakup : ఆర్ధికంగా స్ట్రాంగ్‌గా ఉండటమే .. భార్యభర్తల విడాకులకు కారణమా?

ఈ పోస్ట్‌పై నెటిజన్లు స్పందించారు. ‘ప్రేమంటే ఇది.. ‘ అని ఒకరు.. ‘కొన్ని విషయాలు సిల్లీగా అనిపించవచ్చు.. కానీ మీరు చేసిన పని చాలా అందంగా ఉంది’ అని మరొకరు ఇలా వరుసగా కామెంట్లు పెట్టారు. ఒక్కోసారి కొన్ని అంశాలు వినడానికి చూడటానికి సిల్లీగా అనిపించినా వారి మధ్యగల అందమైన రిలేషన్‌ను సూచిస్తాయని చాలామంది అభిప్రాయపడ్డారు.