పండుగ పూట గుజరాత్‌లో ఘోరప్రమాదం.. ఏడుగురు కూలీలు దుర్మరణం..

ఓ ఫ్యాక్టరీకి అవసరమైన భూగర్భ ట్యాంకు నిర్మాణం కోసం గొయ్యి తవ్వుతున్నారు.

పండుగ పూట గుజరాత్‌లో ఘోరప్రమాదం.. ఏడుగురు కూలీలు దుర్మరణం..

Gujarat Tragic Incident (Photo Credit : Google)

Updated On : October 12, 2024 / 5:47 PM IST

Gujarat Tragic Incident : గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. మెహసానా జిల్లాలోని ఓ నిర్మాణ స్థలంలో మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భూగర్భ ట్యాంకు కోసం గొయ్యి తవ్వుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ టీమ్ రక్షించింది. తీవ్రంగా గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు.

”మెహసానా జిల్లా కాడి తాలూకా జసల్ పూర్ గ్రామంలో నిర్మాణ స్థలంలో ఈ విషాదం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాదాపు 10 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ”ఇదొక ప్రైవేట్ కంపెనీ. ప్రస్తుతం నిర్మాణం జరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 10 మంది వరకు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు.

వారిలో ఏడుగురు కూలీలు మరణించారు. మృతదేహాలను బయటకు తీశాం. 19ఏళ్ల అబ్బాయిని కాపాడాం. మెహసానా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 37 కిలోమీటర్ల దూరంలోని కాడి టౌన్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఓ ఫ్యాక్టరీకి అవసరమైన భూగర్భ ట్యాంకు నిర్మాణం కోసం గొయ్యిని తవ్వుతున్నారు. అనేక మంది కూలీలు ఈ పనిలో ఉన్నారు. అయితే, ఒక్కసారిగా మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. మట్టి పెళ్ల కింద చిక్కుకుని కూలీలు సజీవ సమాధి అయ్యారు” అని మెహసానా జిల్లా అధికారి హస్రత్ జాస్మిన్ తెలిపారు.

Also Read : ఇరాన్‌కు బిగ్ షాక్..! భారీ స్థాయిలో సైబర్ దాడులు.. ఇజ్రాయెల్ ప్రతీకారం మొదలు పెట్టిందా?