International Tiger Day 2023: ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనన్ని పులులు భారత్‌లో ఉన్నాయి.. ఇక చైనాలో ఎన్నున్నాయో తెలుసా?

దాదాపు 100 ఏళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా లక్ష పులులు ఉండేవని అంచనా. ఇప్పుడు మాత్రం...

International Tiger Day - 2023

International Tiger Day 2023 – India: పులి.. ఈ మృగాన్ని దూరం నుంచి చూస్తే చాలా ముచ్చట పడతాం. దగ్గరి నుంచి చూస్తే చాలా భయపడిపోతాం. పులిపై ఉండే చారలు, దాని నడక, దాని ఠీవి అదరహో అనేలా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య (Tigers population) భారీగా తగ్గిపోయింది. 100 ఏళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లక్ష పులులు ఉండేవని అంచనా.

ఇప్పుడు ప్రపంచంలో దాదాపు 5,000 పులులు మాత్రమే ఉన్నాయి. అందులో 3,000కు పైగా భారత్ లోనే ఉన్నాయి. పులులు అంతరించిపోకుండా ప్రపంచం జాగ్రత్తలు తీసుకుంటోంది. వాటిని రక్షించునే ఉద్దేశంతో 2010 నుంచి జూలై 29న ఇంటర్నేషనల్ టైగర్ డేను నిర్వహిస్తున్నారు.

ఆ ఏడాది రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ సిటీలో పులుల సంరక్షణ సమావేశం జరిగింది. పులులసంరక్షణ గురించి ప్రజలలో అవగాహన పెంచాలని నిర్ణయించారు. అడవి పులులు అత్యధికంగా ఉన్న దేశం భారత్. పులుల విషయంలో ప్రపంచంలో ఎవ్వరూ తీసుకోనంత శ్రద్ధ భారత్ తీసుకుంది.

ప్రతి నాలుగేళ్లకు ఒకసారి భారత్ పులుల సంఖ్యను లెక్కపెడుతుంది. 2006 నుంచి దేశంలో పులుల సంఖ్య మరింత పెరుగుతూ వచ్చింది. ఆ ఏడాది 1,411గా ఉన్న పులుల సంఖ్య, 2010లో 1,706కు చేరింది. దేశంలో 2014లో 2,226, 2019లో 2,967, ప్రస్తుత ఏడాదిలో 3,167 పులులు దేశంలో ఉన్నాయి. దేశంలో పులుల సంఖ్య 3,000 మార్కుకు చేరిందని ప్రధాని మోదీ 2019లో ప్రకటించారు.

ప్రపంచంలో అడవి పులుల జనాభా అంచనా
భారతదేశం -3,167
రష్యా – 540
ఇండోనేషియా – 500
నేపాల్ – 355
థాయిలాండ్ – 189
మలేషియా – 150
బంగ్లాదేశ్ – 106
భూటాన్ – 103
చైనా – 50
మయన్మార్ – 22
వియత్నాం – 5
లావోస్ – 2

Whatsapp Unknown Calls : మీ వాట్సాప్‌కు ఈ ఫోన్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా? తస్మాత్ జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి!