111 అడుగులు : ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా ఉదయకుళంగర ప్రాంతంలోని లింగానికి గుర్తింపు లభించింది.

  • Published By: veegamteam ,Published On : January 13, 2019 / 04:24 AM IST
111 అడుగులు : ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం

Updated On : January 13, 2019 / 4:24 AM IST

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా ఉదయకుళంగర ప్రాంతంలోని లింగానికి గుర్తింపు లభించింది.

చెన్నై : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా ఉదయకుళంగర ప్రాంతంలోని లింగానికి గుర్తింపు లభించింది. తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని చెంగల్‌ మహేశ్వర శివపార్వతి ఆలయ ప్రాంగణంలో శివలింగం నిర్మాణాన్ని 2012లో ప్రారంభించారు. 111.2 అడుగుల ఎత్తుతో ఎనిమిది అంతస్తులుగా నిర్మిస్తున్నారు. ఈ శివలింగం వ్యయ అంచనా రూ.10 కోట్లు.

ప్రతి అంతస్తులోనూ ధ్యానమండపాలు కలిగిన ఈ శివలింగం లోపలి భాగం గుహలను తలపిస్తోంది. అందులో పరశురాముడు, అగస్త్యుడు తదితరులు తపస్సు చేస్తున్నట్లు కొన్ని ప్రతిమలు ఏర్పాటు చేశారు. కింది అంతస్తులో భక్తులు అభిషేకం, ఆరాధనలు చేసేందుకు అనువుగా శివలింగం, ఎనిమిదో అంతస్తులో కైలాసగిరిలో శివపార్వతులు ఉన్నట్లు ప్రతిమలు కొలువుదీర్చారు. 

ప్రస్తుతం 80 శాతం పనులు పూర్తైన నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా దీనికి గుర్తింపు లభించింది. ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ ఈ మేరకు గుర్తించింది. మహాశివరాత్రి నాటికి మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలని ఆలయ ప్రతినిధులు నిర్ణయించారు.