Wrestler Sushil Kumar: జైలులో సుశీల్ కుమార్ స్పెషల్ డైట్ డిమాండ్..

హత్యారోపణలతో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సుశీల్ కుమార్.. జైలులో తనకు స్పెషల్ డైట్, సప్లిమెంట్లు కావాలని డిమాండ్ చేశారు. ఈ రెజ్లర్ చేసిన పిటిషన్ ను ఇష్టాలు, కోరికలు మాత్రమే కానీ, అత్యవసరాలు కావని ఢిల్లీ కోర్టు కొట్టిపారేసింది.

Wrestler Sushil Kumar: జైలులో సుశీల్ కుమార్ స్పెషల్ డైట్ డిమాండ్..

Susheel Kumar

Updated On : June 10, 2021 / 11:05 AM IST

Wrestler Sushil Kumar: హత్యారోపణలతో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సుశీల్ కుమార్.. జైలులో తనకు స్పెషల్ డైట్, సప్లిమెంట్లు కావాలని డిమాండ్ చేశారు. ఈ రెజ్లర్ చేసిన పిటిషన్ ను ఇష్టాలు, కోరికలు మాత్రమే కానీ, అత్యవసరాలు కావని ఢిల్లీ కోర్టు కొట్టిపారేసింది.

‘ప్రస్తుత అప్లికేషన్ లో నిందితుడు జైలులో అందిస్తున్న డైట్ లో లోపం ఉందని ఎటువంటి ఆరోపణ చేయలేదు. ఢిల్లీ జైలు రూల్స్ 2018 ప్రకారం.. న్యూట్రియంట్లు సరైన పరిమాణంలో ఇస్తూ బ్యాలెన్స్‌డ్, హెల్తీ డైట్ అందిస్తారు’ అని కోర్టు ఆర్డర్ లో చెప్పింది.

ప్రస్తుతం సుశీల్ కుమార్.. రెజ్లర్ ను హత్య చేసిన కేసులో నిందితుడిగా జైలులో ఉన్నారు. ఆ పిటీషన్ లో తనకు ఒమెగా 3 క్యాప్సుల్స్, ప్రీ వర్కౌట్ సప్లిమెంట్లు, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు కావాలని తాను కాంపిటీషన్ కు ప్రిపేర్ అవుతున్నానని తనకు ఎక్సర్‌సైజ్ బ్యాండ్లు కావాలని చెప్పారు.

రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించిన ఒకే ఒక్క ఇండియన్ సుశీల్ కుమార్.. దేశ రాజధాని ఛత్రసాల్ స్టేడియంలో జూనియర్ సాగర్ ధంగర్ అనే వ్యక్తి హత్య కేసులో సంబంధం ఉందని మే23న అరెస్టు అయ్యాడు. అతను అరెస్టు కాకముందు మూడు వారాల పాటు పరారీలో ఉన్నాడు సుశీల్.