కత్తితో వీరంగం : జైలుపాలు చేసిన టిక్ టాక్ వీడియో

  • Published By: veegamteam ,Published On : May 16, 2019 / 07:46 AM IST
కత్తితో వీరంగం : జైలుపాలు చేసిన టిక్ టాక్ వీడియో

Updated On : May 16, 2019 / 7:46 AM IST

పూణె: టిక్ టాక్. విపరీతంగా పాపులర్ అయిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ‘‘టిక్ టాక్’’. సినిమాల్లోని పాటలు, పాపులర్ డైలాగ్స్, ఎమోషన్స్ ఇలా ఒకటేంటి అన్నింటినీ ఈ యాప్ ద్వారా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యాప్ నిషేధించాలనే డిమాండ్ లు..దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 
టిక్ టాక్ యాప్ తో ఓ వీడియోను తయారు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని పూణె పరిధిలోని పంపరీ చింద్వాడాలో ఓ యువకుడు టిక్ టాక్ వీడియోలో చేసిన విన్యాసాలు అరెస్ట్ కు కారణమయ్యాయి. 

దీపక్ ఆబా దాఖలె అనే 23 సంవత్సరాల యువకుడు  ఓ పదునైన కత్తిని పట్టుకుని..ఓ మరాఠీ పాటకు అనుగుణంగా యాక్షన్ చేస్తు..తానొక డాన్ ననీ తెలిపారు. కాగా వీడియో రూపొందించి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదికాస్తా బెడిసి కొట్టింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది.దీంతో దీప్ ఆబాను పోలీసులు అరెస్ట్ చేసిన లోపలేశారు. 
కాగా దీపక్  ఆబా స్థానికంగా అల్లరి చిల్లరిగా తిరుగతుంటాడని..డబ్బుల కోసం అందరినీ బెదిరిస్తుంటాడని విచారణలో తెలిసింది. గతంలో అతనిపై పలు కేసులు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. తాను డాన్ అనే విషయం అందరికీ తెలియాలనే ఉద్ధేశంతోనే ఈ వీడియో రూపొందించాడని పోలీసులు భావిస్తున్నారు.