మోటర్ బైక్‌లా మారిపోయిన మనిషి..! ఎందుకో తెలిస్తే..!!

టిక్ టాక్ వీడియోలో మోజులో పడ్డ కొంతమంది కోతినుంచి మనిషిలా మారి తిరిగి కోతి చేష్టలతో పిచ్చెక్కిస్తున్నారు. కొంతమంది పిచ్చి పిచ్చి ఫీట్లు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటుంటే మరికొందరు పిచ్చి పనులతో అందరికీ పిచ్చెక్కిస్తున్నారు.
ఎవ్వరూ చేయని ఫీట్ చేయాలి..అందరితోను లైక్స్ కొట్టించుకోవాలి.ఫాలోవర్స్ ను పెంచుకోవాలి. అందరి దృష్టిని ఆకర్షించాలి. వీడెవడోగానీ..భలే చేశాడ్రా..అనిపించుకోవాలి..ఈ పిచ్చితో కొంతమంది యువత చేసే వెర్రి మెర్రి పనులు చూస్తుంటే తలపట్టుకోవాల్సి వస్తోంది. అటువంటి ఓ యువకుడు టిక్ టాక్ లో పాపురల్ అయ్యేందుకు ఓ యువకుడు ఇదిగో ఇలా మోటర్ బైక్ అవతారం ఎత్తాడు.
దీన్ని చూసిన వెంటనే మనం బైక్ అనే అనుకుంటాం. కానీ..పరీక్షగా చూస్తే తప్ప అది బైక్ కాదు మనిషే..అని తెలుస్తుంది. పిచ్చి పీక్స్ కు వెళ్లి క్రియేటివిటీ ఎక్కువైతే ఇటువంటి ఐడియాలే వస్తాయంటున్నారు ఈ వీడియో చూసిన కొంతమంది. ఇంకెందుకు ఆలస్యం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫన్నీ టిక్‌టాక్ వీడియోను మీరు కూడా చూడండీ..
Bike 2020 😉 #FunnyTikTokVideo #TikTokFun #TikTok pic.twitter.com/ofY91lpgrB
— V for Viral (@VForViral1) February 13, 2020