Can Cast Vote In Five Ways, These Are Election Commission Rules
Cast Vote in Five Ways : ఓటు.. ప్రభుత్వాలు నిలబడేందుకు ఇదొక్కటి చాలు.. అధికారంలోకి తీసుకురావాలన్నా.. అధికార పీఠం నుంచి దించాలన్నా ఈ ఓటే ఆయుధం. ఎంతో పవర్ ఫుల్ అయిన ఈ ఓటును ఎన్ని రకాలుగా వేయవచ్చునో మీకు తెలుసా? సాధారణంగా ఓటు వేయాలంటే ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్లి మాత్రమే ఓటుహక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. కానీ, ఈ ఓటింగ్ ప్రక్రియను ఐదు రకాలుగా వేసేందుకు అవకాశం ఉంది. ఒక ఓటును ఐదు విధాలుగా వేయవచ్చు.. సాధారణ ఓటు అంటే.. 18 ఏళ్లు పైబడిన పౌరులు ఎవరైనా దేశంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. వీరంతా నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓట్లు వేయాల్సి ఉంటుంది.
Spying For Pakistan : పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్
అప్పుడే ఈ ఓటును పరిగణిస్తారు. ఇది సాధారణ ఓటుగా చెబుతారు. అత్యధిక శాతం పోలింగ్ ఇలానే కొనసాగుతుంది. రెండోది.. టెండర్ ఓటు.. ఓటరు లిస్టులో పేరు ఉండి.. పోలింగ్ కేంద్రం దగ్గరకు వెళ్లేసరికి తమ ఓటును మరొకరు వేసినప్పుడు.. ఈ ప్రక్రియ మొదలవుతుంది. అసలైన ఓటరు.. టెండరు ఓటు వేసే అవకాశం ఉంది. మూడోది.. సర్వీస్ ఓటు… అంటే.. సరిహద్దుల్లో ఉండే సైనికులు, పారా మిలటరీ దళాల ఉద్యోగులు ఈ విధంగా ఓట్లు వేస్తారు. తమ స్వగ్రామాలకు దూరంగా ఉంటారు. అందుకే ఎన్నికల సంఘం వీరికి సర్వీస్ ఓటు వేసేందుకు వీలు కల్పించింది. నాల్గోది.. ప్రాక్సీ ఓటు… అంటే.. ఓటు వారు వేయకుండా.. ఇతరులను పంపి ఓటు వేయించవచ్చు.
ఈ ప్రక్రియను ప్రాక్సీ ఓటుగా పిలుస్తారు. ఇంటెలిజెన్స్, గూఢచారి సిబ్బంది ఈ తరహా ఓటింగ్ వినియోగించుకుంటారు. ఈ ఓట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. చివరిగా పోస్టల్ బ్యాలెట్.. ఈ పదం చాలా మంది వినే ఉంటారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ సిబ్బంది ఈ బ్యాలెట్ ఓటు వేస్తారు. తమ స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసేందుకు వీలుపడదు. అందుకే వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టు ద్వారా అభ్యర్థికి ఓటు వేయవచ్చు. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది ఈ విధంగా ఓటు వినియోగించుకుంటారు.
Gold Rate : గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధర