Gold Rate : గోల్డ్ ల‌వ‌ర్స్‌కి షాకింగ్ న్యూస్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర

బంగారం ధర పరుగులు పెడుతుంది. అక్టోబర్ నెలలో బంగారం దూకుడు మరింత పెరిగింది. పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్లుగా దూసుకెళ్తోంది.

Gold Rate : గోల్డ్ ల‌వ‌ర్స్‌కి షాకింగ్ న్యూస్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర

Gold Rate

Gold Rate : బంగారం ధర పరుగులు పెడుతుంది. అక్టోబర్ నెలలో బంగారం దూకుడు మరింత పెరిగింది. పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్లుగా దూసుకెళ్తోంది. పండగలతో పాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ ఏర్పడింది. తాజాగా మరోసారి బంగారం ధరలు పెరిగాయి. వెండి సైతం అదేబాటలో వెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడ సహా దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

చదవండి : Gold Price Today : పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,800గా ఉంది. శుక్రవారంతో పోల్చితే రూ.100 పెరిగింది. శుక్ర, శనివారాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.650 పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.110 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 48,870కి చేరింది. స్వచ్ఛమైన బంగారం ఒక్క గ్రాము ధర రూ.4,887గా ఉంది. హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడలో ధరలు ఒకే విధంగా ఉన్నాయి.

చదవండి : Golden Bride : ఈమె బంగారు పెళ్లికూతురు.. వంటిపై 60కేజీల పసిడి

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో నేడు 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 51,220 గా ఉండ‌గా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 46,959వ‌ద్ద కొన‌సాగుతోంది.
దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో శ‌నివారం 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 48,070 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ రూ. 47,070 గా ఉంది.
త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రూ. 45,150 గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం రూ. 49,260 వ‌ద్ద కొన‌సాగుతోంది.
క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రూ. 48,870 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ రూ. 44,800 వ‌ద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే..
హైదారాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 48,870 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 44,800 వ‌ద్ద ఉంది.
విజ‌యవాడ‌లో 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 48,870 గా ఉండ‌గా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 44,800 గా ఉంది.
సాగ‌ర తీరం విశాఖ‌ప‌ట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రూ. 48,870 కాగా, 22 క్యారెట్ల ధ‌ర రూ. 44,800 గా ఉంది.