అందుకే నడిచే దేవుడంటారు :శివకుమార స్వామి చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లు ఆగవు

  • Published By: veegamteam ,Published On : January 22, 2019 / 08:50 AM IST
అందుకే నడిచే దేవుడంటారు  :శివకుమార స్వామి చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లు ఆగవు

Updated On : January 22, 2019 / 8:50 AM IST

కర్ణాటకలోని తుముకూరు సిద్దగంగ మఠాథిపతి శివకుమార స్వామి సోమవారం(జనవరి22, 2019) శివైక్యం అయ్యారు. శివకుమార స్వామిజీని అందరూ నడిచే దేవుడిగా పూజిస్తారు. లక్షల మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య, వైద్యం, భోజస, వసతి సదుపాయాలు కల్పించే శివకుమార స్వామీజీని కర్ణాటక ప్రజలు తమ గుండెళ్లో పెట్టుకొని పూజిస్తారు. సిద్దగంగ మఠంలో ఆయన చికిత్స పొందుతున్న సమయంలో చివరిసారిగా కోరిన ఓ కోరిక గురించి తెలిస్తే అందరి కళ్లల్లో కన్నీళ్లు తిరగడం ఖాయం. తనకు భారత్న రత్ర ఇవ్వమనో మరో పురస్కారం ఇవ్వమనో ఆయన కోరుకోలేదు.

సిద్దగంగా మఠం జూనియర్ స్వామీజితో….నేను శివైక్యం చెందే సమయం ఏక్షణంలోనైనా కావొచ్చు… ఉదయం అయితే పిల్లలందరూ టిఫిన్ చేసిన తర్వాత, ఒకవేళ మధ్యాహ్నాం, రాత్రి అయితే పిల్లలు భోజనం చేసిన తర్వాత నా శివైక్యం విషయాన్ని ప్రస్తావించండి అని జూనియర్ స్వామీజీని ఆదేశించాట. సోమవారం ఉదయం 11.44గంటలకు స్వామీజీ శివైక్యం చెందిన సమయంలో మఠంలో పిల్లలు భోజనం చేస్తున్నారు. స్వామీజీ చివరి కోరిక మేరకు పిల్లలు భోజనం చేసిన తర్వాతే ఆయన శివైక్యం చెందినట్లు ప్రకటించారు. విషయం తెలుసుకున్న పిల్లలందరూ భోరున విలపిస్తూ మఠంవైపు పరుగులు తీశారు.