Train: కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో జారిపడిన మహిళ

ప్రతిరోజూ రైలు ఎక్కుతూ ఎన్నో వేల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చాలా ప్రమాదాలు మానవుడి తప్పిదం వల్ల జరుగుతున్నాయి.

Train

Young Man Rescue Women Passenger From Falling from Train: ప్రతిరోజూ రైలు ఎక్కుతూ ఎన్నో వేల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చాలా ప్రమాదాలు మానవుడి తప్పిదం వల్ల జరుగుతున్నాయి. లేటెస్ట్‌గా ఓ మహిళ కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో ప్రమాదానికి గురైంది. రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యువకుడు కాపాడడంతో నిలబడ్డ మహిళ ప్రాణం:
ఫ్లాట్‌ఫామ్ మీద రైలు కదులుతున్న సమయంలో ఓ మహిళ రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది అయితే, కాస్త వేగం అందుకున్న రైలును అందుకోవడంలో సదరు మహిళ పట్టుకోల్పోయింది. రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఆమె కాలు జారి రైలుతో పాటు ముందుకుపోతుంది. ఇంతలో, మహారాష్ట్ర భద్రతా దళానికి చెందిన ఒక జవాన్ ఆమెను పట్టుకుని ఫ్లాట్‌ఫామ్ మీదకు లాగాడు.

ఈ దృశ్యం ప్రమాదకరంగా కనిపిస్తోంది. చూసేవారు వణికిపోవడం ఖాయం. యువకుడు సరిగ్గా సమయానికి చేరుకోకపోతే ఆమె ప్రాణాలు కోల్పోయి ఉండేది. సదరు మహిళ రైలు తప్పిపోయింది కానీ ప్రాణం మాత్రం మిగిలింది.