Bengal Governor Security: బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ

పశ్చిమ బెంగాల్ నూతన గవర్నర్‌గా సీవీ ఆనంద్ బోస్‌ గతేడాది నవంబర్ 17న నియామకమయ్యారు. నవంబర్ 23న గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.

Bengal Governor Security: బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ

Bengal Governor Security

Updated On : January 4, 2023 / 10:42 AM IST

Bengal Governor Security: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌కు జెడ్ ప్లస్ భద్రతను కల్పిస్తూ కేంద్ర హో వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా గవర్నర్‌కు ప్రమాదం పొంచియున్న నేపథ్యంలో ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను కల్పించారు.

Governor Dhankhar : రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగడం లేదు బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

బోస్ కేరళ కేడర్‌కు చెందిన 1977 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. పశ్చిమ బెంగాల్ నూతన గవర్నర్ గా గతేడాది నవంబర్ 17న నియామకమయ్యారు. నవంబర్ 23న గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, గవర్నర్ పదవికంటే ముందు వెస్ట్ బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసపై నియమించి విచారణ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. తాజాగా ఆయనపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ వర్గాలు నివేదిక ఇవ్వడంతో కేంద్ర హోంశాఖ భద్రతను కట్టుదిట్టంచేసింది.