మెక్సికన్ మోడల్, పారిశ్రామికవేత్త గ్రేసియాను రెండో పెళ్లి చేసుకున్న జొమాటో సీఈవో దీపిందర్ 

Zomato CEO: కంచన్ జోషి అనే అమ్మాయిని దీపిందర్ గోయల్ అప్పట్లో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కూతురు కూడా ఉంది. ఇప్పుడు..

Deepinder Goyal: మెక్సికన్ మోడల్, పారిశ్రామికవేత్త గ్రేసియా మునోజ్‌ను జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ (41) పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీపిందర్ గోయల్‌కు ఇది రెండో వివాహం. గతంలో ఐఐటీ ఢిల్లీలో చదువుతున్న సమయంలో కంచన్ జోషి అనే అమ్మాయిని దీపిందర్ గోయల్ ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కూతురు కూడా ఉంది. ఇప్పుడు ఆయన రెండో పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

జాతీయ మీడియాలో పేర్కొన్న వివరాల ప్రకారం.. రెండు నెలల క్రితం గ్రేసియా, మునోజ్‌ పెళ్లి జరిగింది. గత నెల హనీమూన్‌కు వెళ్లివచ్చారు. గ్రేసియా ప్రస్తుతం పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నారు. మోడలింగ్ ను పక్కన పెట్టారు. ఆమె 2022లో యూఎస్ఏలోని మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్ లో గెలుపొందారు.

గ్రేసియా, దీపిందర్ పెళ్లి చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటన చేయలేదు. భారత్‌లో తన కొత్త ఇంట్లో ఉన్నానంటూ గ్రేసియా మునోజ్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో పోస్ట్ చేశారు. గ్రేసియా మునోజ్‌, దీపిందర్‌కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో దేశంలో ఎంతగా పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట ఫుడ్ బేగా ఈ సంస్థను 2008లో ప్రారంభించారు. 2010 నుంచి జొమాటోగా పేరు మార్చారు. భారత్ తో పాటు యూఏఈలోనూ జొమాటో సేవలు అందిస్తోంది.

Also Read : వాట్సాప్‌లో మరో కొత్త ప్రైవసీ ఫీచర్.. చాట్‌లో లింక్ ప్రివ్యూలు కావాలా? వద్దా? యూజర్లదే నిర్ణయం!

ట్రెండింగ్ వార్తలు