జొమోటోకు రూ. లక్ష జరిమానా

  • Publish Date - October 21, 2019 / 02:41 AM IST

చెన్నైలోని చెట్‌పేట్‌ మెక్‌నికోల్స్ రోడ్‌లో అపరిశుభ్ర వాతావరణంలో జొమాటో సంస్థకు చెందిన బ్యాగులను గుర్తించిన చెన్నై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు.. రూ. లక్ష జరిమానాను విధించారు.

డెంగీ నివారణ చర్యలు చెన్నైలో వేగవంతం అవగా.. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో తనిఖీలు చేసి, ఆయా సంస్థలు, కార్యాలయాలకు కార్పొరేషన్‌ అధికారులు జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలోనే చెన్నై చేట్‌పెట్‌ ఎంసీ నికల్సన్‌ రోడ్డు ఓ భవనంలో ప్రముఖ ఆన్‌లైన్‌ ఆహార సంస్థగా ఉన్నజొమాటోకు చెందిన బ్యాగులు అపరిశుభ్రంగా గుర్తించారు. రూ.లక్ష జరిమానా విధించింది మున్సిపల్ కార్పోరేషన్.

చెన్నై నగరంలో అపరిశుభ్ర వాతావరణం కారణంగా డెంగీ వ్యాధి విపరీతంగా వ్యాపించడంతో నివారణ చర్యల్లో భాగంగా.. అన్నీ కార్యాలయాల సోదాలు చేస్తున్నారు అధికారులు.

ఈ క్రమంలోనే జొమోటో సంస్థ ప్రాంగణంలోని టెర్రస్ మీద ఆహారాన్ని తీసుకెళ్లడానికి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు ఉపయోగించిన సంచులను వదిలిపెట్టి వెళ్లడాన్ని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. దీంతో జోమాటోకు రూ. 1 లక్ష జరిమానా విధించారు. దోమలు వచ్చేందుకు కారణం అయ్యారంటూ ఈ జరిమానా విధించారు అధికారులు.